మందుబాబులకు బ్యాడ్ న్యూస్
Liquor Shops: దేశంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ నెల 19వ తేదీన ప్రారంభం కానుంది. తొలి విడత పోలింగ్ జరుగుతుందా రోజున. జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశలో పోలింగ్ ముగుస్తుంది. అదే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పండగ రోజుల్లో మద్యం అమ్మకాలను నిషేధించింది. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 11వ తేదీన ఈదుల్ ఫితర్, 17వ తేదీన శ్రీరామనవమి, 21వ తేదీన మహావీర్ జయంతి నాడు మద్యం అమ్మకాలను మూసివేస్తారు. మే 23వ తేదీన బుద్ధపూర్ణిమ, జూన్ 17వ తేదీన బక్రీద్ పండగల సమయంలోనూ రోజంతా మద్యాన్ని విక్రయించకూడదని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నెలలో రెండు రోజుల పాటు డ్రై డేను ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ తెల్లవారు జామున 6 నుంచి 26వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీ- ఎన్సీఆర్‌తో పాటు ఢిల్లీకి ఆనుకుని ఉండే ఉత్తరప్రదేశ్ ప్రాంతాలైన ఘజియాబాద్, గ్రేటర్ నొయిడా వంటి చోట్ల కూడా మద్యం అమ్మకాలను నిషేధించింది. ఈ మేరకు ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ కృష్ణ మోహన్ ఉప్పు ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications