కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. బార్ అసోసియేషన్లకు కూడా...
ఢిల్లీ తీస్ హజారీ కోర్టు వద్ద లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణకు సంబంధించి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. పోలీసులు, లాయర్ల వైఖరిపై మండిపడింది. ఘటనపై కేంద్రప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్లకు నోటీసులు జారీచేసింది.

నాలుగు కేసులు నమోదు..
పోలీసులు లాయర్ల గొడవకు సంబంధించి ఇప్పటికే నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఘర్షణపై జిల్లా జడ్జీ, పోలీసులు, ఇద్దరు లాయర్లు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఘర్షణకు సంబంధించి వివరాలు తెలుసుకొనేందుకు శనివారం వేచి చూశాం, నాలుగు గంటలు చూసినా ఎలాంటి సమాచారం లేదు. ఇవాళ కూడా కూర్చొన్నా చెప్పే నాథుడే లేడని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనాస్థలాన్ని అడిషనల్ సెషన్స్ జడ్జీ పింకీ పరిశీలించారని.. లోక్ అదాలత్ కోసం ఇరు పక్షాలు అంగీకరించాయని, కానీ చివరి నిమిషంతో రద్దయిందనే విషయాన్ని కోర్టుకు తెలియజేశారు.

ఇవీ సెక్షన్లు
ఇరుపక్షాల ఫిర్యాదుకు సంబంధించి హత్యాయత్నం, పబ్లిక్ సర్వెంట్‌పై దాడి, పబ్లిక్ సర్వెంట్‌పై దూషణ, ఆస్తుల ధ్వంసం తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఘర్షణపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కూడా ఏర్పాటు చేస్తున్నామని సమాచారం హైకోర్టుకు అందజేశారు.

28 మందికి గాయాలు
శనివారం నాటి ఘటనలో 20 మంది పోలీసులు, ఎనిమిది మంది లాయర్లు గాయపడ్డారు. 12 టూ వీలర్లు, ఒక పోలీసు వాహనం, ఎనిమిది జైలుకు సంబంధించిన వ్యాన్లు ధ్వంసమయ్యాయి. మరికొన్నింటికీ నిప్పంటించడంతో కాలిబూడిదయ్యాయి.

ఏం జరిగిందంటే..
తీస్ హజారీ కోర్టు వద్ద గల పార్కింగ్ విషయంలో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణకు దారితీసిందని తెలుస్తోంది. కానీ లాయర్ల వాదన మరోలా ఉంది. కోర్టు ప్రాంగణంలో ఓ లాయర్ వస్తోండగా పోలీసు వాహనం ఢీ కొందని తీస్ హజారీ బార్ అసోసియేషన్ తెలిపింది. తమ ముందు కొందరు పోలీసులు లాయర్‌ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారని.. దాడి చేశారని పేర్కొన్నారు. వెంటనే తాము కలుగజేసుకున్నామని వివరించారు. అలా.. వారి మధ్య మాటల నుంచి చేతల వరకు వెళ్లింది. లాయర్‌ను ఢీ కొన్న పోలీసు జీపును తగలబెట్టే వరకు పరిస్థితి వెళ్లింది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications