కుమార్ విశ్వాస్‌కు చుక్కెదురు: డిసిడబ్ల్యూ సమన్లపై స్టేకు హైకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ మహిళా కమిషన్.. కుమార్ విశ్వాస్‌కు జారీ చేసిన సమన్లపై స్టే విధించేందుకు హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. స్టే విధించాలని కోరుతూ కుమార్ విశ్వాస్ వేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం తిరస్కరించింది.
హైకోర్టు తీర్పుతో కుమార్ విశ్వాస్ మహిళా కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ మహిళా వాలంటీర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు మే 4న మహిళా కమిషన్.. కుమార్ విశ్వాస్‌కు సమన్లు జారీ చేసింది.

కాగా, మే 7న తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసినా కుమార్ విశ్వాస్ హాజరుకాకపోవడంతో మహిళా కమిషన్ అధిపతి బర్ఖా శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మహిళా కమిషన్ ఇచ్చిన సమన్లపై స్టే విధించాలని కోరుతూ కుమార్ విశ్వాస్ మే 7న హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, బహిరంగంగా తమ సంబంధాన్ని చెప్పకుండా కుమార్ విశ్వాస్ తన జీవితాన్ని నాశనం చేశాడని బాధితురాలు పేర్కొంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications