కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? అసెంబ్లీలో గందరగోళం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జన్ లోక్‌పాల్ బిల్లు కోసం రాజీనామాకు సైతం సిద్ధమని కేజ్రీవాల్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం జన్ లోక్‌పాల్ బిల్లు సభలో పెడతారని అందరు భావించారు.

జన్ లోక్‌పాల్ బిల్లును తీసుకు రావాలని ఎఎపి పట్టుదలతో ఉండగా కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అదం సమయంలో బిల్లును అసెంబ్లీలో పెట్టకపోతే రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టవద్దని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీ సభాపతికి లేఖ రాశారు. దీంతో కేజ్రీవాల్ రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ సూచనను పక్కన పెట్టి జన్ లోక్‌పాల్ బిల్లు విషయంలో ఢిల్లీ సర్కారు ముందుకే వెళ్లాలనే మరో ఆలోచన కూడా చేస్తోంది.
కాగా, లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రం ప్రతినిధి అని, ఆయన జన్ లోక్‌పాల్ బిల్లును అసెంబ్లీకి పంపించే ముందు అన్నింటిని పరిశీలించాలని, ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించవద్దని భారతీయ జనతా పార్టీ పేర్కొంది.
సభలో బిల్లు ప్రవేశ పెట్టిన ఎఎపి ప్రభుత్వం
ఎఎపి ప్రభుత్వం అసెంబ్లీలో శుక్రవారం మధ్యాహ్నం జన్ లోక్‌పాల్ బిల్లును ప్రవేశ పెట్టింది. బిల్లుపై చర్చించాలని ఎఎపి సభ్యులు చెబుతుండగా, గవర్నర్ పంపిన లేఖ పైన ఓటింగ్ పెట్టాలని కాంగ్రెసు, బిజెపి పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.












Click it and Unblock the Notifications