నన్ను పెళ్లి చేసుకో అని యోగి మార్ఫింగ్ వీడియో ట్వీట్ : నిందితుడి అరెస్ట్
లక్నో/ న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోనో ఉంటే చాలు రెచ్చిపోతున్నారు. తమ భావజాలాన్ని ఇతరులపైకి రుద్ది .. ఆనందం పొందుతున్నారు. ఇలా రాజకీయ నేతుల, సినీతారుల, క్రీడాకారులపై తమ పైత్యాన్ని ప్రదర్శించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. యూపీకి చెందిన ఓ వ్యక్తి కూడా ఇలానే పోస్టులు పెట్టి .. జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.
పెళ్లి చేసుకో ..
యూపీకి చెందిన ప్రశాంత్ కనౌజ .. ఇదివరకు మీడియాలో పనిచేశాడు. కానీ తన పైత్యాన్ని మాత్రం వీడలేదు. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అందులో ఓ మహిళ తనను పెళ్లి చేసుకోవాలని యోగి ఆదిత్యనాథ్‌ను కోరుతుంది. యోగి ఆదిత్యనాథ్ బ్రహ్మచారి అనే విషయం తెలిసిందే. ఆ మహిళ వీడియో ముందు యోగి ఫోటో మార్పింగ్ చేసి .. ప్రశాంత్ పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. దీనిని తన ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో పోస్టు చేశారు. దీంతో వీడియో వైరలవడంతో .. పోస్ట్ పెట్టిన ప్రశాంత్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

పరువుకు భంగం ..
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరువు భంగం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటు ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తప్పుడు సమాచారంతో, సోషల్ మీడియాలో తప్పుపట్టించారనే అభియోగం కింద కేసు పెట్టారు. దీంతోపాటు 67, ఐటీ 500, 505 సెక్షన్ల కింద కేసు కట్టారు.

దీంతోపాటు యూపీ సీఎం యోగి పరువుకు భంగం కలింగించారని టీవీ చానెల్ ఎడిటర్ పై కూడా మరో కేసు నమోదు చేశారు పోలీసులు. జూన్ 6న జరిగిన చర్చ కార్యక్రమంలో .. యోగి ఆదిత్యనాథ్ పై మహిళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు ఆ చానెల్ కూడా సరైన అనుమతులు తీసుకోకుండా నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు. చానెల్ పై ఫోర్జరీ .. తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టినట్టు ఎస్పీ వైభవ్ కృష్ణ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications