తల్లేనా?: ఏడుస్తోందని రోజుల పసికందును చెత్తబుట్టలో పడేసింది, మృతి

Recommended Video

    తల్లేనా?: ఏడుస్తోందని రోజుల పసికందును చెత్తబుట్టలో పడేసింది, మృతి

    న్యూఢిల్లీ: నవ మాసాలు మోసి.. పసి పాపకు జన్మనిచ్చిన ఓ తల్లి.. ఆ చిన్నారి పసికందు ఏడుపును మాత్రం భరించలేపోయింది. లోకంలో మనసున్న ఏ తల్లీ చేయని దారుణానికి పాల్పడింది.

    ఎడతెరిపిలేకుండా ఏడుస్తోందనే నెపంతో రోజుల పసిపాను చెత్తబుట్టలో విసిరికొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ 25రోజుల పసికందు ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన తూర్పు ఢిల్లీలో చోటు చేసుకుంది.

    Delhi: Newborn dies after ‘frustrated’ mother throws baby in garbage dump

    వివరాల్లోకి వెళితే.. తూర్పు ఢిల్లీలోని వినోద్ నగర్‌కు చెందిన ఓ మహిళకు 25రోజుల క్రితం కూతురు జన్మించింది. ఆ పసికందు తీవ్రంగా ఏడుస్తుంటే ఓదార్చాల్సింది పోయి.. కర్కశంగా ప్రవర్తించింది.

    ఎంత సముదాయించినా ఏడుపు ఆపడం లేదని ఆగ్రహానికి గురైన ఆమె.. ఆ పసికందును చెత్తబుట్టలో విసిరికొట్టింది. దీంతో గాయాలపాలైన ఆ చిన్నారి.. ఊపిరాడక కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ కిరాతక తల్లిని అరెస్ట్ చేశారు. ఇంత అమానవీయంగా ప్రవర్తించిన నిందితురాలిని కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+