సునంద హత్య: పాక్ జర్నలిస్టు తరార్‌ను ప్రశ్నించనున్న పోలీసులు
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు పాకిస్తాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది. తన మృతికి ముందు సునంద పుష్కర్ ఈమె విషంయంలోనే థరూర్‌తో గొడవ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్‌ను విచారించడానికి ఢిల్లీ పోలీసులు ప్రశ్నలను తయారు చేసినట్లు సమాచారం.
మెహర్ తరార్‌కు ఈమెయిల్‌లో ప్రశ్నలు పంపి సమాధానాలు అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సునంద పుష్కర్ మృతికి కొన్ని రోజుల ముందు మెహర్ తరార్ శశి థరూర్‌ను కలిశారు. ఈ విషయంలో తాను అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తరార్ ఇటీవల ఓ టీవీ చానెల్‌తో చెప్పిన విషయం తెలిసిందే.

దర్యాప్తు అధికారులు సింగ్, సునీల్ టక్రు అనే ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ను కూడా పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. తమ మరణానికి ముందు సునంద పుష్కర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు సింగ్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దర్యాప్తు అధికారులు శనివారంనాడు సునంద పుష్కర్ మరణించిన లీలా ప్యాలెస్ హోటల్‌కు వెళ్లి రెండు గంటల పాటు గడిపారు.
దర్యాప్తు అధికారులు హోటల్ సిబ్బందిని ప్రశ్నించి, గదిని మరోమారు పరిశీలించారు. గదిలో సిరంజీలాంటిదాన్ని దేన్నయినా చూశారా అని పోలీసులు సిబ్బందిని అడిగారు. పోలీసులు శశి థరూర్ పిఎస్ అభినవ్ కుమార్‌ను ప్రశ్నిస్తారని అంటున్నారు. అలాగే, థరూర్ డ్రైవర్ బజరంగ్‌ను, ఆమె మృతికి ముందు సునంద పుష్కర్‌తో మాట్లాడిన మహిళా జర్నలిస్టును పోలీసులు విచారించాలని అనుకుంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications