దారుణం: బెదిరింపులకు గురిచేసి కోడలిపై ఏసిపి రేప్
న్యూఢిల్లీ: ప్రజలకు, మహిళలకు రక్షణగా నిలవాల్సిన ఓ పోలీసు ఉన్నతాధికారి తన కొడుకు భార్యపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేను నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కోడలిపై అత్యాచారం చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసిపి)పై కేసు నమోదు చేసినట్లు దక్షి ఢిల్లీలోని వసంత్‌కుంజ్ పోలీసులు మంగళవారం మీడియాకు తెలిపారు. అయితే సదరు నిందిత ఉన్నతాధికారి పేరు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.

బాధితురాలి పేరు బహిర్గతం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఉత్తర ఢిల్లీలోని కీలక ప్రాంతంలో ఏసిపిగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
గత మే నెలలో నిందిత ఏసిపి తనను బెదిరింపులకు గురిచేసి అత్యాచారం చేశాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కాగా, సదరు ఏసిపిని ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications