Delhi Polls: రాహుల్ ను అంటే బీజేపీకి కోపమొస్తుందే..? కేజ్రివాల్ ఫైర్..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోరు ఆప్, బీజేపీ మధ్యే ఉంది. అయితే మూడో పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలియదు కానీ ఈ రెండు పార్టీల మాటల యుద్ధానికి మాత్రం ఉపయోగపడుతోంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందించడంపై ఆప్ అధినేత కేజ్రివాల్ ఫైర్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తుంటే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో అర్దమవుతోందన్నారు.

ఈ వివాదం అంతటికీ కారణం అరవింద్ కేజ్రివాల్ ఇండియా కూటమిలో తమ మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలే.
రాబోయే ఢిల్లీ ఎన్నికలు కాంగ్రెస్, బిజెపి మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న కుమ్మక్కును బహిర్గతం చేస్తాయని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. అలాగే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిపై బీజేపీ ఐటీ వింగ్ ఛీఫ్ అమిత్ మాలవీయ స్పందించారు.

Delhi Polls Arvind Kejriwal counter to bjp over reacting to his remark on Rahul gandhi

తాను దేశం గురించి ఆలోచిస్తుంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారని కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అమిత్ మాలవీయ.. దేశం గురించి తర్వాత చింతించండి. ముందు న్యూఢిల్లీ సీటును కాపాడుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు. దీనిపై కేజ్రివాల్ ఘాటుగా స్పందించారు. తాను రాహుల్ గాంధీ గురించి ఒక్క లైన్ మాత్రమే చెప్పానని, కానీ దీనికి బిజెపి నుండి స్పందన వస్తోందన్నారు. బిజెపి ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటుందో చూడండి, బహుశా ఈ ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ , బిజెపి మధ్య సంవత్సరాల తరబడి తెరవెనుక జరుగుతున్న కుమ్మక్కు బట్టబయలు అవుతుందన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+