వర్ష బీభత్సం: ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు.. దెబ్బతిన్న కార్లు
ఢిల్లీలో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జమ మసీదు ప్రాంతంలో ఓ బాల్కనీ కూలింది. దీంతో 50 ఏళ్ల వ్యక్తి పడి పోయి చనిపోయాడు. ఉత్తర ఢిల్లీలో 65 ఏళ్ల వృద్దుడు కూడా చనిపోయాడు. జమ మసీదు మిడిల్ డోమ్ ఫైనల్ కూడా కూలింది. ఉరుములతో నష్టం వాటిల్లింది. దీంతో ముగ్గురు వరకు గాయపడ్డారు. విజయ్ చౌక్ వద్ద ఉన్న పందిరి కూడా గాలికి కూలింది.
జమ మసీదు దెబ్బతిన్న భాగాన్ని తీసివేయాలని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు లేఖ రాశానని జమ జమ మసీద్ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ తెలిపారు. మిడిల్ డోమ్ మూడు భాగాలుగా విడిపోయింది. రెండు పడిపోగా.. మరొకటి అలాగే వేలాడుతుంది. ఈదరుగాలులతో కూడిన వర్షం వల్ల కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. వృక్షాలు నెలరాలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వాతావరణ పరిస్థితి సరిగా లేదు. దీంతో విమానాలను కూడా మళ్లించారు.

వర్షం వల్ల చెట్లు కూలాయని రాత్రి 8 గంటల వరకు 294 కాల్స్ వచ్చాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ షాహిబ్ సింగ్ వర్మ కారు కూడా దెబ్బతింది. అధికార నివాసం ఎదుట పార్కింగ్ చేయగా.. చెట్లు కూలింది. చెట్టు పడటంతో కారులో ఇరుక్కున్న ముగ్గురిని కాపాడామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలి వానతో నగరంలోని ఏపీ, తెలంగాణ భవన్‌లో వర్ష బీభత్సం కూడా సృష్టించింది. గాలి వాన వల్ల ఏపీ, తెలంగాణ భవన్ పరిధిలో ఉన్న భారీ వృక్షాలు కూలిపోయాయి. కూలిన చెట్లు సిబ్బంది నివాసాలపై పడ్డాయి. దీంతో సిబ్బంది నివాస భవనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.












Click it and Unblock the Notifications