ఢిల్లీ రేప్: పశ్చ్తాత్తాపం లేని డ్రైవర్, కొడుకును శిక్షించాలని తల్లి
న్యూఢిల్లీ: ఢిల్లీ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ అత్యాచారం పైన నిందితుడు శివకుమార్ యాదవ్ తల్లి స్పందించారు. తన తనయుడు తప్పు చేశాడని, అతనిని శిక్షించాలని ఆమె చెప్పారు.
కాగా, క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ తన నేరాన్ని అంగీకరించారు. 25 ఏళ్ల ఫైనాన్స్ ప్రొఫెషనల్ యువతిని అత్యాచారం చేసినట్లు చెప్పాడు. అయితే, ఈ అత్యాచారం చేసినందుకు అతను ఏమాత్రం పశ్చాత్తాపపడటం లేదని తెలుస్తోంది.
దేశ రాజధానిలో నడుస్తున్న కారులోనే అత్యాచార ఘటన నేపథ్యంలో సదరు బాధితురాలు ప్రయాణించిన క్యాబ్ సర్వీస్ ఉబెర్ ట్రావెల్స్‌ను ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. అలాగే ఈ సంస్థ జనరల్ మేనేజర్ గగన్ భాటియాపైనా నేరపూరిత నిర్లక్ష్యం అభియోగంతో కేసు నమోదుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

నిందితుడు
తాను అత్యాచారానికి గురయ్యానని బాధితురాలు తన ప్రెండ్‌కు మెసేజ్ పంపితే అది నిందితుడైన క్యాబ్ డ్రైవర్‌కే వెళ్లిందట. తనను రోడ్డుపై శివకుమార్ యాదవ్ పడేసి వెళ్లిపోయిన తర్వాత క్యాబ్ డ్రైవర్ తనను రేప్ చేశాడంటూ బాధితురాలు ఫ్రెండ్‌కు మెసేజ్ పంపించాలని అనుకుంది. అయితే, అది అతనికే వెళ్లిందట.

నిందితుడు
శుక్రవారం రాత్రి ఢిల్లీలో 25 ఏళ్ల మహిళ క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్‌కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్‌లో పని చేస్తోంది.

నిందితుడు
మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్‌ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు. కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది.

కారు
ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications