రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..!
దసరా సెలవులు పూర్తయ్యాయి. ప్రస్తుతం విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నారు. అయితే విద్యార్థులకు గుడ్ న్యూస్. అక్టోబర్ 7 స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. ఆ రోజు వాల్మీకి జయంతి పర్వదినం సందర్భంగా దేశ రాజధాని దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ లోని స్కూళ్లు, కాలేజీలు మూతపడనున్నట్లు సమాచారం అందుతోంది. వాల్మీకి జయంతిని ఒక సాంస్కృతిక, మతపరమైన పర్వదినంగా హిందువులు భావిస్తారు. రామాయణాన్ని రచించిన విషయం తెలిసిందే. వాల్మీకి జయంతి సందర్భంగా దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ లోని పాఠశాలలు, కాలేజీలు మూతపడనున్నాయి. అయితే దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాయి రాష్ట్ర ప్రభుత్వాలు.
అక్టోబర్ 7 వాల్మీకి జయంతి సందర్భంగా దిల్లీ, ఉత్తరప్రదేశ్ లోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ లతో సహా.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు మూతపడనున్నాయి. ఈ మేరకు అక్కడి ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. ఈమేరకు ఉత్తరప్రదేశ్ లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు అక్టోబర్ 7న మూసివేయనున్నామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తాజాగా ప్రకటించారు. నవరాత్రుల సెలవులు అయిపోగానే.. మళ్లీ విద్యార్థులకు ఒకరోజు హాలీడే రావడంతో ఖుషీ అవుతున్నారు.
ఇక ఏటా ఆశ్వయుజ మాసంలోని పౌర్ణమినాడు మహర్షి వాల్మీకి జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. రామాయణాన్ని మహర్షి వాల్మికి రచించారు. ఆయన జయంతిని పురస్కరించుకుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం మహర్షి వాల్మీకి మహర్షి కశ్యపుడు, అదితి దంపతుల తొమ్మిదవ కుమారుడు. మహర్షి వాల్మీకికి ఆ పేరు ఎలా వచ్చిందనే దాని వెనుక ఒక పురాణగాథ ఉంది.

వాల్మీకి కఠోరమైన ధ్యానంలో ఉన్నప్పుడు చెదపురుగులు అతని శరీరం చుట్టూ చేరి, పుట్టలను కట్టాయట. సంస్కృతంలో చెదపురుగుల పుట్టలను వాల్మీకి అని పిలుస్తారు. అందుకే ఆనాటి నుంచి మహర్షి పేరు వాల్మీకిగా మారింది. రామాయణం ప్రకారం శ్రీరాముడు.. సీతా మాతను విడిచిపెట్టిన తర్వాత, ఆమె మహర్షి వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. శ్రీరాముని కుమారులైన లవ కుశలకు సకల విద్యను అందించిన ఘనత కూడా వాల్మీకికే దక్కుతుందని పురణాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications