Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Delhi water Crisis: ఢిల్లీలో తీవ్ర తాగునీటి సమస్య..మారని నేతల తీరు..!

Delhi water Crisis:దేశ రాజధాని ఢిల్లీకి పెద్ద కష్టం వచ్చి పడింది. అక్కడే ప్రధాని అక్కడే ముఖ్యమంత్రి ఉండి పాలన చేస్తున్న ఈ గొప్ప నగరంలో ప్రజలు సంతోషంగా లేరు. సుభిక్షంగా కనిపించడం లేదు. కనీసం గొంతు తడుపుకోలేనంత కష్టంలో ఢిల్లీ ప్రజలు కాలం వెల్లదీస్తున్నారు. ఢిల్లీ నగరంలో ఎందుకీ నీటి సంక్షోభం వచ్చింది.. ఎవరిది తప్పు.. సామాన్య ప్రజలదా.. లేక పరిపాలిస్తున్న నాయకులదా..?

బింద నీటికోసం పోరాటం..

ఢిల్లీ నగరాన్ని తాగునీటి సమస్య పీడిస్తోంది. వేసవి కాలంలో తాగునీటి సమస్యను ఎదుర్కొన్న ఢిల్లీ వాసులకు ఆ కష్టాలు తీరలేదు. సీజన్ మారినప్పటికీ కూడా తాగునీటి సమస్య వీరిని వెంటాడుతోంది. ఎప్పుడెప్పుడు తమ కాలనీలోకి వాటర్ ట్యాంకర్ వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి వాటర్ ట్యాంకర్ రాగానే వారి ఆనందానికి అవధుల్లేవు. అదే సమయంలో ఒక బింద నీళ్ల కోసం వారు చేసే పోరాటానికి అంతులేదు. నీటి ట్యాంకర్ అలా వచ్చి ఆగిందో లేదో ఒక్కసారిగా ప్రజలు దాన్ని చుట్టుముట్టేస్తున్నారు. ఈ క్రమంలో కొంత నీరు నేలపాలవుతోంది.

Delhi Water Crisis Deepens Amid Political Turmoil Residents Queue for Tankers

పైపు లైన్ లీకేజ్ సమస్య

ఢిల్లీ పరిసర ప్రాంతాలైన చాణక్యపురిలోని గీతా కాలనీ, సంజయ్ క్యాంప్,పటేల్ నగర్, మెహ్రాలీ,ఛత్తర్‌పుర్‌లో నీటి ఎద్దడి తీవ్ర స్థాయిలో ఉంది. వాటర్ ట్యాంకర్ రాగానే కొన్ని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఒక బిందె నీళ్లను తీసుకెళుతున్న ఘటన చూస్తే చాలా బాధేస్తుంది. యమునా ఖాదర్ ప్రాంతంలో ఎక్కడైనా పైప్‌ లైన్లలో లీకేజీ సమస్య ఉందా అని కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే ఎక్కడా పైపు లైన్ లీకేజీ లేదని నిర్థారించారు. ఇదిలా ఉంటే ఢిల్లీ నీటి ఎద్దడి సమస్య రాజకీయ రంగు పులుముకుంది.

ప్రధాన నీటిపైపు లైన్లకు భద్రత

నీటి ఎద్దడి ఎక్కువ కావడంతో అక్కడక్కడ పైపులైన్లకు రంద్రాలు పెట్టి నీటిని తీసుకెళుతున్నారన్న ఆరోపణలు రావడంతో పైపు లైన్ల వద్ద భద్రత ఉంచాల్సిందిగా ఢిల్లీ మంత్రి అతిషి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్‌‌ను కోరారు.సోనియా విహార్ ట్రీట్‌మెంట్ నుంచి ఢిల్లీ సౌత్‌కు అనుసంధానమయ్యే పైపులైన్ వద్ద లీకేజీని గుర్తించినట్లు ప్యాట్రోలింగ్ సిబ్బంది తమ దృష్టికి తెచ్చారని అతిషీ వెల్లడించారు. ఇక ఢిల్లీ నీటి ఎద్దడి సమస్యను బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు మంత్రి అతిషి.

Delhi Water Crisis Deepens Amid Political Turmoil Residents Queue for Tankers

నీటి సమస్యకు రాజకీయ రంగు

ఢిల్లీ ప్రజలపై బీజేపీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. కేంద్ర జలశక్తి మంత్రి ఇప్పటికీ జోక్యం చేసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆమె ఎద్దేవ చేశారు. కానీ కేజ్రీవాల్ ప్రభుత్వం పై మాత్రం ఖాళీ కుండలతో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపడుతున్నారని ఫైర్ అయ్యారు. లీకవుతున్న నీటిపైపులకు మరమత్తులు చేయించడం మానేసి మంత్రి అతిషి బీజేపీపై మండిపడటం చాలా విడ్డూరంగా ఉందని ఇందుకు బీజేపీ ఎలా కారణమవుతుందని కౌంటరిచ్చింది. కాంగ్రెస్ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై అటు కేంద్ర ప్రభుత్వంపై నిరసనలు తెలిపారు.

నీటి సమస్యపై పార్టీలు రాజకీయాలు చేయడం మానేసి త్వరగా ఒక పరిష్కార మార్గం అన్వేషించాలని ఢిల్లీ వాసులు మొరపెట్టుకుంటున్నారు. తాగు నీరు లేక చిన్నపిల్లల గొంతులు తడారిపోతున్నాయని, ఈ సమయంలో రాజకీయాలు మానుకోవాలని మానవతా కోణంలో ఆలోచించి వెంటనే సమస్య పరిష్కరించాలని ఢిల్లీ ప్రజలు ఇటు రాష్ట్రప్రభుత్వాన్ని అటు కేంద్రప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+