ఢిల్లీ రైల్వే స్టేషన్ ఆవరణలో విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. కాగా, వర్షాలతో విద్యుత్ స్తంభాల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఆవరణలో కురిసిన వర్షం కారణంగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. దీంతో అక్కడున్న ప్రయాణికులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షపు నీరు స్టేషన్ ఆవరణలోకి చేరింది. ఆదివారం తెల్లవారుజామున ఛండీగఢ్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది సాక్షి అహుజా అనే మహిళ. అయితే, స్టేషన్ ఆవరణలోని విద్యుత్ స్తంభానికి తగలడంతో ఆమె విద్యుత్ షాక్‌కు గురైంది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లేడీ హార్డింజ్ ఆస్పత్రికి తరలించారు.

Delhi woman dies of electrocution at railway station amid rain, probe underway

మృతురాలు భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. సాక్షిని తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్ నివాసిగా గుర్తించారు.కాగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఆవరణలో నీటి కుంటల్లోకి వెళ్లకుండా ఉండేందుకు విద్యుత్ స్తంభాన్ని పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై ఆ మహిళ మృతి చెందిందని స్థానికులు చెప్పారు. .

ఢిల్లీ పోలీసు అధికారి ప్రకారం.. నిర్లక్ష్యానికి సంబంధిత అధికారిపై ఫిర్యాదు నమోదు చేసినట్లు, ఒక బృందం సంఘటన జరిగిన ప్రాంతాన్ని తనిఖీ చేస్తోందది. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.కాగా, విద్యుత్ షాక్ మహిళ చనిపోయిన సమయంలో.. విద్యుత్ స్తంభం నుంచి కొన్ని వైర్లు బయటకు వచ్చి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అధికారుల నిర్లక్ష్యంగా కారణంగానే విద్యుత్ స్తంభం నుంచి కేబుల్స్ బయటకు వచ్చాయని, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఓ మహిళ ప్రాణం కోల్పోయిందని స్థానికులు మండిపడుతున్నారు. 'మేము చండీగఢ్‌కు వెళ్తున్నాం. నా కూతురు విద్యుదాఘాతంతో చనిపోయిందని సమాచారం అందినప్పుడు నేను పార్కింగ్ ప్రాంతంలో ఉన్నాను. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగింది' అని మృతురాలి తండ్రి లోకేష్ చోప్రా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+