వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెల్టా ప్లస్: కోవిడ్-19లో కొత్త వేరియంట్.. కాక్‌టెయిల్ చికిత్స దీనిపై పనిచేయట్లేదు - Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనా

''కరోనావైరస్ సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్ (బి 1.617.2) ప్రధాన పాత్ర పోషించింది. ఈ వేరియంట్‌లో మ్యుటేషన్లు జరగడంతో కొత్తగా వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్‌ (బి.1.617.2.1 - ఏవై 1) ఇక్కడ వ్యాపిస్తున్నట్లు గుర్తించాం’’ అని నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మంగళవారం వెల్లడించారు.

''మార్చి నుంచే ఈ వేరియంట్ ఐరోపాలో విజృంభిస్తోంది. ఇక్కడ జూన్ 13న ఈ వేరియంట్ వ్యాపిస్తున్నట్లు గుర్తించాం. కాక్‌టెయిల్ యాంటీబాడీల చికిత్సలు కూడా ఈ కొత్త వేరియంట్‌పై పనిచేయడం లేదు’’ అని ఆయన చెప్పారు.

https://twitter.com/ANI/status/1404764007530074112

కరోనా రోగులకు కాక్‌టెయిల్ ఔషధాన్ని వినియోగించేందుకు ఇటీవల భారత ఔషధ ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. ఈ యాంటీబాడీ ఔషధం ఒక డోసుకు రూ.59,750గా ధర నిర్ణయించారు.

''ఈ వేరియంట్‌ వ్యాప్తిపై ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని కేసులు ప్రస్తుతానికి తక్కువే ఉన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మేం అధ్యయనం చేపడుతున్నాం’’ అని వీకే పాల్ చెప్పారు.

మరోవైపు డెల్టా వేరియంట్‌పై మిగతా వ్యాక్సీన్ల కంటే స్పుత్నిక్ వి మెరుగ్గా పనిచేస్తోందని రష్యాకు చెందిన ద గమలేయ సెంటర్ ఫర్ స్టడీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

https://twitter.com/ANI/status/1404758879913734147

ఏప్రిల్, మే నెలల్లో భారత్‌లో కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు రోజుకు నాలుగు లక్షలకుపైనే కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Delta Plus: New variant in Covid-19,Cocktail treatment does not work on it
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X