సుప్రీం జడ్జిల వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు: కాంగ్రెస్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: నలుగురు సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు సర్వోన్నత న్యాయస్ధానంలో పరిస్థితి సవ్యంగా లేదని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. న్యాయమూర్తుల ఆవేదన నేపథ్యంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితిలో ఉందని వ్యాఖ్యానించింది.

సుప్రీం కోర్టు పనితీరుపై నలుగురు సీనియర్‌ జడ్జీలు అసంతృప్తి వ్యక్తం చేయడం ఆందోళనకరమని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ట్విట్టర్‌లో పేర్కొంది.

'Democracy in danger', tweets Congress on SC judges' revolt against CJI

సుప్రీం న్యాయమూర్తులు అసాధారణంగా విలేకరుల సమావేశం నిర్వహించి మరీ సర్వోన్నత న్యాయస్ధానంలో లొసుగులను వెల్లడించడం కలకలం రేపింది. మరోవైపు న్యాయమూర్తులు వెల్లడించిన అంశాలు న్యాయవ్యవస్థ అంతర్గత వ్యవహారమని, ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కపిల్ సిబల్, మనీష్ తివారీలు సుప్రీం కోర్టు జడ్జిలు మీడియా సమావేశంతో పాటు చోటు చేసుకొన్న పరిణామాలను వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Reacting to the four judges' ''unprecedented'' and "extraordinary" press conference – the first in the history of Indian judiciary ever - the Congress said in a tweet that the development implies that “democracy was in danger”

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి