మాట్లాడితే భూకంపం: రాహుల్ గాంధీకి వెంకయ్య కౌంటర్

న్యూఢిల్లీ: తాను పార్లమెంటులో మాట్లాడితే భూకంపం వస్తుందన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యల పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు కౌంటర్ ఇచ్చారు. భగవంతుడు అలా చేయడని భావిస్తున్నట్లు తెలిపారు.

అలా జరగదని తాము ప్రార్థిస్తున్నామన్నారు. లోకసభలో బీజేపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది, అందుకే రాహుల్ గాంధీ అలా అని ఉంటారని చమత్కరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఆ భూకంపం ఏదో పార్లమెంటులో ఎవరూ లేని సమయంలో వస్తే బాగుండు అన్నారు.

demonetization debate, venkaiah attacks rahul gandhi on his 'earthquake' statement

నోట్ల రద్దు అంశంపై ప్రధాని మోడీని విమర్శించే హక్కు రాహుల్ గాంధీకి లేదన్నారు. అవినీతి అంతం చేయాలనుకోవడం తప్పా అని నిలదీశారు. నల్ల కుబేరులను శిక్షించాలనుకోవడం నేరం అవుతుందా అని అడిగారు.

కాగా, అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తనను నోట్ల రద్దు అంశంపై పార్లమెంటులో మాట్లాడనీయడం లేదని, తాను మాట్లాడితే భూకంపం వస్తుందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు పైన ప్రధాని మోడీ చర్చించకుండా వెళ్తున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+