వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనాగరికులుగా వద్దు: ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన మోడీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎగరవేశారు. అంతకుముందు బాపూజీ ఘాట్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు.

125 కోట్ల మంది భారతీయులకు మొదట ఆయన స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపాు. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సంకల్పిద్దామని పిలుపునిచ్చారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన అన్నారు.

స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చడమే దేశ ప్రజల సంకల్పం కావాలని అన్నారు. ముక్కలుగా ఉన్న దేశాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకం చేశారని గుర్తు చేశారు. ఈ స్వాతంత్ర్య వెనక లక్షలాది మంది మహాపురుషుల త్యాగం దాగివుందని చెప్పారు.

సురాజ్యం ఏర్పడాలంటే త్యాగాలు తప్పనిసరి అన్నారు. సురాజ్యం కల ఇంకా ఆలస్యం చేయరాదని అన్నారు. సామాన్యుడి జీవితంలో మార్పు తేవడమే సురాజ్యం అని అన్నారు. రెండేళ్లలో ప్రారంభించిన పథకాల గురించి చెప్పాలంటే సమయం సరిపోదని అన్నారు. 70వ ఏట మనం చేస్తున్న మన సంకల్పం దేశాన్ని రూపాంతరీకరణ చేసేందుకు తోడ్పడాలని అన్నారు.

గత ప్రభుత్వం చేసిన అభివవ్రుద్ధి శూన్యమని అన్నారు. దేశంలో గత రెండేళ్ల నుంచే అభివ్రుద్ధి జరుగుతోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు, విద్యుత్, మరుగుదొడ్డి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ అందించడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.

Independence Day Narendra Modi speech:

ఢిల్లీకి 3గంటలు ప్రయాణిస్తే వస్తే ఓ గ్రామంలో తమ ప్రభుత్వం వచ్చే వరకూ విద్యుత్ సౌకర్యం ేదని అన్నారు. రెండు వారాల్లోనే ఇప్పుడు పాస్ పోర్ట్ పొందగలుగుతున్నారని చెప్పారు. టెక్నాలజీతో జన జీవనంలో మార్పులు తేవాలన్నారు. పారిశ్రామిక విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రజలకు తమ ప్రభుత్వం జవాబుదారీగా ఉందని చెప్పారు.

సామాన్యుడి ప్రయోజనాలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పారదర్శక పాలనను అందిస్తున్నామని తెలిపారు. ఎల్ఈడీ బల్పులను పంపిణీ చేస్తున్నామని,ఎల్ఈడీ బల్బుల వినియోగం ద్వారా వేల మెగావాట్ల విద్యుత్ ఆదా అవుతోందని చెప్పారు. ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత కోసం ఆన్ లైన్ విధానం అవలంభించామని చెప్పారు.

అంతేగాక, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రజల గురించి మోడీ ప్రస్తావించారు. ఈ స్వతంత్య్ర దినోత్సవం నాడు నేను కొందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను అంటూ మోడీ తెలిపారు. బలోచిస్థాన్‌, గిల్గిత్‌, బల్తిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రజలు తనపై ఎంతగానో ప్రేమ చూపుతున్నారని.. తాను వారి దగ్గర లేకపోయినా.. వారిని కలిసే అవకాశం లేకున్నా.. అక్కడి ప్రజలు మాత్రంతనపై ప్రేమ, గౌరవాన్ని చూపుతున్నారని మోడీ అన్నారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాని మోడీ పేర్కొన్నారు. ఇంకా..

  • పథకాల్లో రాయితీలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయి
  • కాలం మరింది.. ప్రణాళికల్లో లెక్కలు చెబితే ప్రజలు నమ్మరు
  • కళ్లెదుట పని జరిగినప్పుడే ప్రజలు నమ్ముతారు
  • విద్యుత్ ఉత్పత్తే సరిపోదు, సరఫరా మెరుగుపడాలి
  • ఈ రెండెళ్లలో 18వేలకుపైగా గ్రామాలకు విద్యుత్ అందించాం
  • ఒక కంపెనీ నమోదు గతంలో నెలపాటు తిరగాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు వారంలోపే సమయం పడుతోంది.
  • అన్ని రంగాల్లో భారీ అభివరుద్ధి దిశగా ముందుకెళ్తున్నాం
  • జన్ ధన్ యోజన పథకంతో కొత్త ఆర్థిక ప్రయోజనానికి నాంది పలికాం
  • ఈ రెండేళ్లలో 70కోట్ల మందిని ఆధార్ తో అనుసంధానించాం
  • రూ. 350 విలువ చేసే ఎల్ఈడీ బల్బును రూ. 50 అందించేలా చేశాం
  • రైతుల కోసం పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం
  • 21కోట్ల మందిని జన్ ధన్ యోజనతో అనుసంధానించాం
  • ఖతార్ తో గ్యాస్ సరఫార ఒప్పందాన్ని పునర్ సమీక్షించుకోవడం ద్వారా రూ. 20వేల కోట్ల ఆదా
  • ఇరాన్ లోని చాబహార్ నౌకాశ్రయ నిర్మాణంతో భారత్ కొత్త అధ్యాయనానికి తెరతీసింది
  • పునరుత్పాదక ఇంధన వనరులే మనకు భవిష్యత్
  • 5కోట్ల మంది పేదలకు గ్యాస్ సౌకర్యం అందించే ప్రయత్నిస్తున్నాం
  • ద్రవ్యోల్బణాన్ని 4 నుంచి 2శాతానికి తగ్గించేందుకు ఆర్బీఐ చరయలు తీసుకుంటోంది
  • అసంపూర్తిగా ఉన్న 18 ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం
  • అనేక ప్రాజెక్టులకు నాంది పలికాం
  • మా ప్రభుత్వ లక్ష్యంగా అన్ని రంగాల్లో భారత అభివ్రృద్ది
  • బాలికల విద్య కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాం
  • ముద్ర పథకంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నాం
  • ఎన్నోఏళ్లుగా కొనసాగుతున్న బంగ్లాదేశ్ వివాదానికి ముగింపు పలికాం
  • ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయాల్సిందే
  • పెషావర్ స్కూల్ లో ఉగ్రవాదులు దాడి జరిపి, వందలాది మంది పిల్లల ప్రాణాలు తీశారు. ఆ ఘటన ప్రతీ భారతీయుడిని ఆవేదనకు గురిచేసింది.
  • పేదరిక నిర్మూలన కోసం అందరం కలిసి పోరాడాలి
  • వివక్ష చూపిస్తూ అనాగరికులుగా వ్యవహరించొద్దు, 125 కోట్ల మంది కలిస్తేనే అభివ్రృద్ది సాధ్యం.
భారత్ మాతా కీ జై, వందేమాతరం అని నినాదాలిచ్చిన ప్రధాని మోడీ జై హింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
English summary
Prime Minister Narendra Modi hoisted the national flag at the ramparts of Red Fort for the third time as India celebrates its 70th Independence Day on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X