మద్యానికి డబ్బివ్వలేదని కూతురు సజీవ దహనం
భోపాల్: తాగుడుకు బానిసైన ఓ తండ్రి.. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్న కూతురినే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జమ్లి గ్రామంలో చేటుచేసుకుంది.
బాధిత యువతి మౌ కంటోన్మెంట్ సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. చగన్ లాల్(45) అనే వ్యక్తి శనివారం ఉదయం తాగడానికి డబ్బులు ఇవ్వాలని కూతురితో గొడవ పడ్డాడు.

ఇందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి లోనైన చగన్ లాల్.. ఆమెపై కిరోసిన పోసి నిప్పు అంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె మౌ నియోజకవర్గ పరిధిలోని సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు చగన్ లాల్‌ని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications