షాక్: సీటివ్వలేదని రైల్లో ప్రయాణీకులపై కారం చల్లాడు, ఎక్కడంటే?

తనకు సీటివ్వలేదనే నెపంతో ఓ వ్యక్తి ప్రయాణీకులపై కారం చల్లాడు. దీంతో ఏడుగురు ప్రయాణీకులు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ ఘటన ముంబాయిలోని లోకల్ ట్రైన్ లో చోటుచేసుకొంది.

ముంబై: తనకు సీటివ్వలేదనే నెపంతో ఓ వ్యక్తి ప్రయాణీకులపై కారం చల్లాడు. దీంతో ఏడుగురు ప్రయాణీకులు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ ఘటన ముంబాయిలోని లోకల్ ట్రైన్ లో చోటుచేసుకొంది.

మంగళవారంనాడు షాహద్ రైల్వేస్టేషన్ నుండి సీఎస్ టీ నుండి బయలుదేరిన రైల్లో ఓ వ్యక్తి తనకు కూడ సీటు కావాలంటూ తోటి ప్రయాణీకులతో గొడవకు దిగాడు.

 Denied seat, AC mechanic throws chilli powder on local train passengers

అయితే వారు అంగీకరించలేదు.దీంతో ఆగ్రహం చెందిన ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకొన్న కారాన్ని ప్రయాణీకులపై చల్లాడు. దీంతో రైల్లో ప్రయాణీస్తున్న ఏడుగురు ప్రయాణీకులు అస్వస్థతకు గురయ్యారు.

కళ్ళు, శరీరంపై మంటలు రావడంతో బాధితులు కళ్యాణ్ వద్ద రైలును దింపి ఆసుపత్రిలో చికిత్స అందించి పంపించారు. అయితే ఈ ఘటనపై ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సీసీటీవి పుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకొన్నారు. గతంలో సీటు కోసం వాళ్ళు తనపై దౌర్జన్యానికి దిగారనీ, అందుకు ప్రతీకారంగానే తాను వారిపై కారం చల్లినట్టు నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు. సీటు కోసం రైళ్ళలో గొడవలు జరగడం మామూలే. అయితే ఏకంగా కారం చల్లడం మాత్రం తొలిసారి జరిగిందని అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+