వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను కూడా లైంగికదాడి బాధితుడినే.. పార్లమెంట్‌లో ప్రకటించిన ఆ ఎంపీ ఎవరంటే..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశంలో లైంగికదాడులు ఆందోళన కలిగిస్తోన్నాయి. చిన్న పిల్లలను కూడా వదలడం లేదు కీచకులు. అయితే దీనిపై పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా తన అనుభవాన్ని పేర్కొన్నారు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్. తనకు జరిగిన ఘటనను పంచుకోవడంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు.

పార్లమెంట్‌లో లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించడం (పోక్సో)పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ మాట్లాడారు. తనకు 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు లైంగికదాడికి గురయ్యానని తెలిపారు. చిన్న పిల్లలపై లైంగిక హింస ఇంట్లో నుంచి మొదలవుతుందన్నారు. అయితే ప్రజాజీవితంలో ప్రజలు దీని గురించి విసృతంగా చర్చించాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే దీనిపై పిల్లలకు అవగాహన వస్తుందని చెప్పారు.

Derek OBrien Shares Sex Abuse Story, Smriti Irani Praises His Courage

తనకు జరిగిన ఘటనను డెరెక్ వివరించారు. 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు టెన్సీస్ ఆడి వస్తున్నానని పేర్కొన్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి తనను లైంగికంగా హింసించాడని చెప్పారు. నిక్కర్, టీ షర్ట్ వేసుకున్న తనను ఒకతను రేప్ చేశాడని సభలో చెప్పారు. వాస్తవానికి ఈ విషయం తాను చెప్పి ఉండాల్సింది కాదు .. కానీ మనం ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. చెప్పుకోవాలి. చిన్న పిల్లలను లైంగిక హింస నుంచి కాపాడాలి అని సభకు వివరించారు. అయితే డెరెక్ ధైర్యాన్ని కేంద్రమంత్రి ఇరానీ ప్రసంశించారు. తనపై జరిగిన లైంగికదాడిని నిర్భయంగా చెప్పిన డెరెక్ మీకు జోహార్లు అని కొనియాడారు.

English summary
Trinamool Congress leader Derek O'Brien today shared that he was sexually abused as a teenager and urged people to talk about such experiences instead of repressing them, as he participated in a debate in parliament on a law on sexual crimes against children. Union Minister Smriti Irani was among the members who praised his courage to talk about the horror.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X