పూర్తి మెజారిటీ ఉన్నా అన్ని పదవులు ఊస్ట్, మేయర్, డిప్యూటీ మేయర్లు, ఎంఐఎం దెబ్బ !
కర్ణాటకలోని విజయపుర మున్సిపల్ మహానగర కార్పొరేషన్ లో హైడ్రామా చేటుచేసుకుంది. ఇన్ని రోజులు కార్పోరేషన్ లో అధికారంలో ఉన్న బీజేపీకి చుక్కలు చూపించిన కాంగ్రెస్ పార్టీ మేయర్ సీటు, డిప్యూటీ మేయర్ సీటును కైవసం చేసుకుంది. మెజారిటీ కార్పోరేటర్లు ఉన్నప్పటికీ బీజేపీ ఓడిపోవడంతో ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
విజయపురలో మేయర్ సీటు, డిప్యూటీ మేయర్ సీటు కాంగ్రెస్ దక్కించుకోవడంతో ఆ సిటీ బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. విజయపుర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన మెహజబీన్ హోర్తి ఎన్నికయ్యారు. మేయర్ పదవికి ఎన్నికైన మహేజాబీన్ హోర్తి మొత్తం 22 ఓట్లు సాధించి కొత్త మేయర్ గా గెలుపొందారు. మేయర్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేయబడింది. 10 మంది కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు, ఐదుగురు స్వతంత్రపార్టీ కార్పోరేటర్లు, ఇద్దరు ఏఐఎంఐఎం (ఎంఎంఐ) కార్పోరేటర్లు మేయర్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఇదే విదంగా ఒక జేడీఎస్ కార్పోరేటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంబీ పాటిల్, విఠల్ కటకదొండ, విధాన పరిషత్ సభ్యులు (ఎమ్మెల్సీ) సునీలగౌడ్ పాటిల్, ప్రకాష్ రాథోడ్ ఓట్లతో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విజయం సాధించారు. విజయపుర కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని ఎస్టీ వర్గానికి రిజర్వ్ చేశారు. డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన దినేష్ హళ్లి ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ మేయర్, డిప్యూటీ మేయర్ రెండు స్థానాల్లో విజయం సాధించింది.
బీజేపీకి చెందిన 16 మంది కార్పోరేటర్లు, విజయపుర సిటీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను బహిష్కరించడంతో ఇతర కార్పోరేటర్ల మద్దతుతో కాంగ్రెస్ విజయం సాధించింది. కార్పొరేషన్ ఆవరణంలో కాంగ్రెస్ మద్దతుదారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, మంత్రి ఎంబీ పాటిల్ తదితర ప్రజాప్రతినిధులకు పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు.

మేయర్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయపుర వార్డు నంబర్ 34కు చెందిన మెహజబీన్ హోర్తీ, బీజేపీ అభ్యర్థిగా వార్డు నంబర్ 12కి చెందిన కార్పోరేటర్ రష్మీకోరి నామినేషన్ పత్రాలు సమర్పించారు. డిప్యూటీ మేయర్ పదవికి వార్డు నంబర్ 18కి చెందిన దినేష్ హళ్లి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో విజయపుర కార్పోరేషన్ కు చెందిన ఎన్నికల్లో మొత్తం 35 స్థానాల్లో 17 బీజేపీ, 10 కాంగ్రెస్, 5 స్వతంత్రులు, 2 ఎంఐఎం, ఒకరు జేడీఎస్ పార్టీ నుంచి కార్పోరేటర్లుగా విజయం సాధించారు.
కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, నాగఠాన్ ఎమ్మెల్యే విఠల్ కటకదొండ, శాసనమండలి సభ్యుడు సునీల్‌గౌడ్ పాటిల్, ప్రకాశ్ రాథోడ, ఎంపీ రమేశ్ జిగజినాగి ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయపుర మేయర్, డిప్యూటీ మేయర్ ఫలితాల అనంతరం బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ స్పందిస్తూ ఇది చట్ట వ్యతిరేకంగా ప్రజాతీర్పును కించపరిచేలా జరిగిన ఎన్నికలు అని అభివర్ణించారు. ఈ విషయమై మేము కోర్టుకు వెతుతామని బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్ తెలిపారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications