Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ అగ్రనేతలతో దేవెగౌడ, కుమారస్వామి భేటీ: ఎన్డీఏలోకి జేడీఎస్, నేడే ప్రకటన!

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరుపార్టీల నేతలు కీలక చర్చలు జరిపారు. తాజాగా, గురువారం కూడా జేడీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు కుమారస్వామి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమైనట్లు తెలిసింది.

ఈ సందర్భంగా 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ మధ్య పొత్తులు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించినట్లు సమాచారం. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో దేవేగౌడ, కుమారస్వామి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏలో జేడీఎస్ చేరికపై శుక్రవారం రోజునే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీకి బయల్దేరే ముందు కుమారస్వామి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు.

Deve Gowda and Kumaraswamy meets BJP leadership in Delhi, JD(S) likely to join NDA today

గురువారం సాయంత్రం సమావేశం ఉంది. ఆ భేటీలోఫలితం తేలాక ఢిల్లీలో మీడియా ప్రతినిధులకు రేపు(శుక్రవారం) అన్ని వివరాలు వెల్లడిస్తామని కుమారస్వామి తెలిపారు. ఇప్పటి వరకు తాము సీట్ల అంశంపై చర్చించలేదని.. బీజేపీ కూడా సీట్ల గురించి ఏమీ ప్రతిపాదించలేదని కుమారస్వామి చెప్పారు. ఈ భేటీలో రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో ప్రస్తుత పరిస్థితి, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ వాతావరణంపై వివరంగా చర్చిస్తామని తెలిపారు.

కాగా, ఇటీవల జరిగిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన జేడీఎస్.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప.. జేడీఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో జేడీఎస్, బీజేపీ నేతల మధ్య జరిగే భేటీలో పొత్తుపై క్లారిటీ రానుంది. నేడే ఈ పొత్తుపై ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. కాగా, జేడీఎస్-బీజేపీ పొత్తుపై కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య మండిపడుతున్నారు. వారి పొత్తు అనైతికమని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+