Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షిండే.. అవునన్నా, కాదన్నా: మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఫైనల్..

New Maharashtra CM: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఏక్‌నాథ్ షిండే తన మనసు మార్చుకోకపోవడం దీనికి ప్రధాన కారణం. స్వయంగా భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నా ఆయన మెట్టు దిగట్లేదు.

సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సీట్ల సంఖ్యా బలం బీజేపీకి లేదు. 149 సీట్లల్లో పోటీ చేసి 132 చోట్ల గెలిచిందీ పార్టీ. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి.

Devendra Fadnavis likely to declare as Chief Minister of Maharashtra on Nov 4

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మిత్రపార్టీల మద్దతు తప్పనసరి కావడంతో ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన భీష్మించింది. షిండేకు మరోసారి అవకాశం ఇవ్వాలని లేదా కనీసం 50:50 పవర్ షేర్ ఫార్ములాను అయినా అంగీకరించాలని ప్రతిపాదిస్తోంది. అవేవీ వాస్తవ రూపాన్ని దాల్చట్లేదు.

ఇప్పటివరకు షిండే శివసేన పెట్టిన ఏ ఒక్క డిమాండ్‌కు కూడా బీజేపీ పెద్దలు తల ఊపలేదు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ వైపే మొగ్గు చూపుతోందా పార్టీ. ఆయనకే ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించడానికి రంగం సిద్ధం చేసింది. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా చేపట్టింది.

ఈ నెల 5వ తేదీన ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రులూ ప్రమాణం చేస్తారు. ఆ అదృష్టం ఎవరికి దక్కుతుంది? మంత్రివర్గ ఫార్ములా ఎండబోతోంది? ఉప ముఖ్యమంత్రులెవరు అనే విషయంపై సస్పెన్స్ క్రమంగా వీడుతోంది.

ముఖ్యమంత్రి పగ్గాలను తామే అందుకోబోతున్నామంటూ బీజేపీ కేంద్ర పరిశీలకుడు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆయన ముంబైలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు. దేవేంద్ర ఫడ్నవిస్‌ పేరును ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.

బుధవారం పార్టీ శాసన సభా పక్షం సమావేశమౌతుందని, సభ్యులు తమ ఫడ్నవిస్‌ను తమ నాయకుడిగా ఎన్నుకుంటారని రూపాణి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్ణయాల మేరకే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక జరుగుతుందని అన్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, దీనికి మహాయుటి నేతలు కూడా అంగీకరించారని అన్నారు. 5వ తేదీన కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని విజయ్ రుపాణీ వెల్లడించారు. దీనికి సంబందించిన ఏర్పాట్లు ముంబై ఆజాద్ మైదాన్‌లో తుదిదశకు చేరుకున్నాయని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+