కేంద్ర మంత్రిపై స్వామీజీ పోటీ, ఊహించని షాక్ ఇచ్చిన భక్తులు, ఏం కావాలో తేల్చుకోండి!
లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్షంగా పెట్టుకున్న రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులను గెలిపించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే టిక్కెట్లు రాకపోవడంతో పలు నియోజక వర్గాల్లో కొందరు నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. కొన్ని నియోజక వర్గాల్లో సైలెంట్ గా ఉండిపోతున్న నాయకులు మీకు ఇష్టం వచ్చిన వాళ్లకు ఓట్లు వేసుకోండి అంటూ వాళ్ల అనుచరులకు చెబుతున్నారు.
ఇంత తతంగం జరుగుతున్న సమయంలో బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రికి పోటీగా ఓ స్వామీజీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని అనుకుంటున్న ఆ స్వామీజీ ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఏదో అనుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్న స్వామీజీకి మఠం భక్తులు ఊహించని షాక్ ఇచ్చారు.

కర్ణాటకలోని ధారవాడ లోక్‌సభ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిపై పోటీ చేస్తున్న శిరహట్టి మఠానికి చెందిన శ్రీ ఫకీర్ దింగాళేశ్వర స్వామీజీపై ఆయన భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల క్రితం మేము (భక్తులు) శిరహట్టి మఠానికి మిమ్మల్ని ఉత్తరాధికారి (మఠాధిపతి)ని చేసి మీకు పట్టం కడితే మీరు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు లేనిపోని రాద్దాంతానికి కారణం అవుతున్నారా ? అంటూ మఠం భక్తులు మండిపడుతున్నారని తెలిసింది.
మఠం కోసం పని చెయ్యాల్సిన మీరు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు, మిమ్మల్ని మఠం వారసుడిగాలా చేసింది రాజకీయాలు చెయ్యడానికి కాదు అని భక్తులు అంటున్నారు. మీ చేతిలో మఠం పెట్టింది రాజకీయాల కోసం కాదని భక్తులు హెచ్చరించారు. మఠం చేతిలో ఉంది కదా అని మీరు రాజకీయాలు చెయ్యాలని చూస్తే పద్దతి వేరుగా ఉండదని కొందరు భక్తలు దింగాలేశ్వర స్వామీజీని పరోక్షంగా హెచ్చరించారని తెలిసింది.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని అనుకున్నా, తాను రాజకీయాలు చేస్తానని అంటే మీరు మఠం వదిలి వెళ్లిపోయి సంతోషంగా రాజకీయాలు చేయాలని శ్రీ దింగాళేశ్వర స్వామీజీకి భక్తలు సూచించారని కన్నడ మీడియా తెలిపింది. ఆధ్యాత్మికతకు ప్రతీకగా మఠం పేరు తెచ్చుకుందని, ఇక్కడ ఉంటూ రాజకీయాలు చేయడం సరికాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ధారవాడ లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా దింగాళేశ్వర స్వామిజీ పోటీ చెయ్యడాన్ని మఠం భక్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

శ్రీ దింగాళేశ్వర స్వామీ పోటీ కారణంగా పరోక్షంగా కాంగ్రెస్ లబ్దీ పొందే అవకాశం ఉందని భక్తులు అంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో శ్రీ దింగాలేశ్వర స్వామీజీ పోటీ చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అయితే శ్రీదింగాలేశ్వర స్వామీజీకి ఆశించిన స్థాయిలో భక్తులు మద్దతు తెలుపకపోవడంతో స్వామీజీ కూడా నిరాశ చెందుతున్నారని, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి డిసైడ్ అయిన స్వామీజీ అయోమయంలో పడిపోయారని తెలిసింది.
ఇలాంటి సమయంలో మఠం భక్తులు శ్రీదింగాలేశ్వర స్వామీజీ తీరుతో మండిపడటంతో చివరికి ఆయన ఏం చేస్తారో అనేది వేచి చూడాలని స్థానికులు అంటున్నారు. శ్రీదింగాలేశ్వర స్వామీజీ ఇటీవల ఎన్నికల ప్రచార సభను ప్రారంభించారు. అయితే శ్రీ దింగాలేశ్వర స్వామీజీ ఆశించిన జనం, భక్తుల మద్దతు లభించడం లేదని ధారవాడ ప్రజలు అంటున్నారు. శ్రీ దింగాళేశ్వర స్వామీజీ రాజకీయ ప్రవేశం భక్తులకు నచ్చకపోవడంతో పెద్దగా ఆదరణ లభించడం లేదని తెలిసింది.












Click it and Unblock the Notifications