విమానాల నిర్వహణపై కేంద్రం కీలక ఆదేశాలు
Alaska Airlines flight: అలస్కా ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 రకానికి చెందిన విమానం.. ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఘటన అనంతరం భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అప్రమత్తం అయింది. దేశీయ విమానయాన సంస్థలన్నింటికీ కీలక ఆదేశాలను జారీ చేసింది.
అలస్కా ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9.. గాల్లో ఉన్నప్పుడు కిటికీ పగిలిపోయిన విషయం తెలిసిందే. విండో మొత్తం ఊడి కిందపడింది. ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర భయందోళనకు గురి చేసింది. ఒరెగాన్ పోర్ట్‌ల్యాండ్ నుంచి కాలిఫోర్నియాలోని ఒంటారియాకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ సమయంలో విమానంలో మొత్తం 171 మంది ప్రయాణికులు, ఆరుమంది సిబ్బంది ఉన్నారు. కిటికీ ఊడిపోయిన తరువాత ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. అదృష్టశావత్తూ ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. ప్రయాణికులు, క్రూ సురక్షితంగా ల్యాండ్ కాగలిగారు.
ఈ ఘటన అనంతరం డీజీసీఏ.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశీయ పౌర విమానయాన సంస్థలన్నీ కూడా తమ వద్ద ఉన్న బోయింగ్ 737 ఫ్లైట్లల్లో అత్యవసర ద్వారాలను తనిఖీ చేయాలంటూ ఆదేశించింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అన్నీ కూడా వన్-టైమ్ చెకింగ్‌కు అనుమతులను ఇచ్చింది. ఇప్పటికిప్పుడే వాటి పనితీరును పరిశీలించాలని సూచించింది.
దీనిపై 24 గంటల్లోగా.. అంటే ఆదివారం సాయంత్రానికి సమగ్ర నివేదికను అందించాలని డీజీసీఏ ఆదేశాలను జారీ చేసింది. భారత్‌కు చెందిన పౌర విమానయాన సంస్థల వద్ద బోయింగ్ 737 మ్యాక్స్ 9 రకానికి చెందిన విమానాలు లేవు. బోయింగ్ 737, బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలు పరిమితంగా ఉన్నాయి.
వేర్వేరు విమానయాన సంస్థల వద్ద 42 బోయింగ్ 737 మ్యాక్స్ ఫ్లైట్లను నిర్వహిస్తోన్నాయి. అత్యధికంగా ఆకాశ ఎయిర్‌లైన్స్ వద్ద 20 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. స్పైస్‌జెట్- 12, ఎయిరిండియా- 10 విమానాలను నడుపుతున్నాయి. వాటన్నింటి ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను తనిఖీ చేసి 24 గంటల్లోగా నివేదిక అందజేయాలంటూ డీజీసీఏ ఆదేశించింది.












Click it and Unblock the Notifications