Air India: ఎయిరిండియాకు షాక్.. వీల్ చైర్ ఇవ్వనందుకు రూ.30 లక్షల ఫైన్..
ఎయిరిండియాను టాటా సంస్థ కొనుగోలు చేసిన నుంచి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏదో ఒక విషయంలో ఎయిరిండియా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఎయిరి ఇండియాకు ఏవియేషన్ రెగ్యులేటర్.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) షాక్ ఇచ్చింది. ఎయిరిండియాకు రూ.30 లక్షల ఫైన్ విధించింది. వీల్ చైర్ ఇవ్వనందుకు ఈ జరిమానా విధించింది. ముంబైలోని అరైవల్ ఏరియాలో నడుకుంటూ వెళ్తున్న 80 సంవత్సరాల వ్యక్తి కుప్పకూలిపోయాడు.
ఆ వెంటనే ప్రాణాలు విడిచాడు. అయితే అతనికి వీల్ చైర్ ఇవ్వనందకు ఎయిరిండియాపై క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా ఫైన్ వేసింది డీజీసీఏ. 80 సంవత్సరాల వృద్ధుడు తన భార్యతో కలిసి ఫిబ్రవరి 12 ఎయిర్ ఇండియా విమానంలో ముంబైకి వచ్చాడు. ముంబై విమానశ్రయానికి రాగానే సిబ్బంది వీల్ చైర్ కావాలని అడిగాడు. అయితే అప్పటికే అతని భార్య వీల్ చైర్ లో ఉంది. అందుబాటులో మరో వీల్ చైర్ లేదు.

దీంతో సిబ్బంది వృద్ధుడి కాసేపు వేచి ఉండాలని కోరారు. అయితే సమయం లేకపోవడంతో సదరు వృద్ధుడు తన భార్య తో కలిసి ముందుకు నడిచాడు. ఈ క్రమంలోనే వృద్ధుడు స్పృహా కోల్పోయాడు. అతన్ని తట్టి చూడగా.. చనిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ జరిపింది. ఇందుకు సంబంధించి ఎయిర్ ఇండియాకు ఫిబ్రవరి 20న నోటీసులు జారీ చేసింది. నోటీసులపై ఎయిరిండియా సమాధానం ఇచ్చింది.
వృద్ధుడు వీల్ చైర్ కోసం వేచి చూడకుండా వెళ్లిపోయినట్లు తెలిపింది. అయితే నడవలేని వారికి వీల్ చైర్ అందించాల్సిన బాధ్యత విమానయాన సంస్థపై ఉంటుందని డీజీసీఏ స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని తేల్చి చెప్పింది. 1937 ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనల ప్రకారం ఎయిర్ ఇండియాకు రూ.30 ఫైన్ విధించినట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications