ఎయిర్ విస్తారాకు రూ. 70 లక్షల జరిమానా: ఎందుకంటే?
ఎయిర్ విస్తారాకు భారీ షాక్ తగిలింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ).. ఎయిర్ విస్తారాకు రూ. 70 లక్షల జరిమానా విధించింది.
న్యూఢిల్లీ: ఎయిర్ విస్తారాకు భారీ షాక్ తగిలింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ).. ఎయిర్ విస్తారాకు రూ. 70 లక్షల జరిమానా విధించింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు అవసరమైన కనీస విమానాలను నడపలేదనే కారణంతో ఈ భారీ జరిమానా విధించింది డీజీసీఏ.
నిబంధనలు పాటించలేదనే కారణంతో ఈ జరిమానా గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే విధించింది. ఈ క్రమంలో ఎయిర్ విస్తారా తాజాగా, 70 లక్షల రూపాయలను జరిమానాగా డీజీసీఏకు చెల్లించింది.

కాగా, జనవరిలో ఢిల్లీ నుంచి భువనేశ్వర్‌కు వెళుతున్న ఎయిర్ విస్తారా విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు.
ఈ సంఘటన తర్వాత, ఎయిర్ విస్తారా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక లోపం కారణంగా విమానం వెనక్కి వెళ్లవలసి వచ్చింది. UK-781 DEL-BBI విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాత్రి 8:19 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. విమానయాన సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గుర్తించిన చిన్న సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి తిరిగి రావాల్సి వచ్చింది. ముందుజాగ్రత్త చర్యగా పైలట్లు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆ ప్రకటన వెల్లడించింది.












Click it and Unblock the Notifications