ఇండిగో సంస్థకు డీజీసీఏ భారీ షాక్: రూ. 1.50 కోట్ల జరిమానా, ఎందుకంటే?
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్ లైన్స్‌కు భారీ షాక్ తగిలింది. విమానం ఆలస్యం కావడంతో ముంబై విమానాశ్రయంలో నేలపైనే ప్రయాణికులు ఆహారం తీసుకున్న ఘటనలో ఇండిగో (Indigo) సంస్థకు రూ. 1.50 కోట్లు జరిమానా విధించాయి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS). ముంబై ఎయిర్ పోర్ట్‌కు కూడా రూ. 90 లక్షల జరిమానా విధించాయి.
డీజీసీఏ ఇరు సంస్థలకు చెరో రూ. 30 లక్షల చొప్పున జరిమానా వేయగా.. బీసీఏఎస్ ఇండిగోకు రూ. 1.20 కోట్లు, ముంబై విమానాశ్రయంకు రూ. 60 లక్షలు చొప్పున జరిమానా విధించింది. యాక్టివ్ ఆప్రాన్(విమానాలు పార్క్ చేసే ప్రదేశం)లో అధిక సమయం ప్రయాణికులు ఆరు బయట ఉండటం నిబంధనలకు విరుద్ధమని ఈ సందర్భంగా డీజీసీఏ వెల్లడించింది.

పైలటర్ల రోస్టరింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎయిరిండియా, స్పైస్ జెట్ సంస్థలకు డీజీసీఏ రూ. 30 లక్షల చొప్పున జరిమానా విదించింది. కాగా, ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా భారీ సంఖ్యలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు గంటలపాటు విమానాలు, విమానాశ్రయాల్లోనే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
passengers of IndiGo Goa-Delhi who after 12 hours delayed flight got diverted to Mumbai having dinner just next to indigo plane pic.twitter.com/jGL3N82LNS
— JΛYΣƧΉ (@baldwhiner) January 15, 2024
అయితే, చాలా ఆలస్యమవడంతో కొందరు ప్రయాణికులు కిందికి దిగి నేలపై కూర్చుని భోజనాలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కేంద్ర పౌర విమానయాన శాఖ ఇండిగో సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో తాజాగా, డీజీసీఏ, బీసీఏఎస్ భారీ జరిమానాలు విధించడం గమనార్హం. కాగా, ఇటీవల కాలంలో ఇంత భారీ జరిమానాను ఓ విమానయాన సంస్థకు విధించడం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications