బ్లాక్ మనీ వెల్లడించేందుకు మరో అవకాశం, హెచ్చరిక

న్యూఢిల్లీ: దేశీయ నల్లధనం వెల్లడికి మరో అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే జూన్ నుంచి స్వచ్ఛంద వెల్లడికి నిర్దేశించిన బ్లాక్ మనీ విండోను ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా నల్లధనం వివరాలను వెల్లడించిన వారికి ఐటీ శాఖ నుంచి ఉపశమనం లభిస్తుంది.

జూన్ 1 నుంచి నాలుగు నెలలపాటు అంటే సెప్టెంబర్ 30 వరకు అక్రమ సొమ్ముపై 45 శాతం పన్ను చెల్లించి సక్రమంగా మార్చుకోవచ్చునని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ సొమ్ముపై ఎలాంటి జరిమానాను గాను, విచారణను గాను ఎదుర్కొవాల్సిన అవసరం లేదని తెలిపింది.

ఇన్‌కం డిక్లరేషన్ స్కీమ్ 2016 ప్రకారం సెప్టెంబర్ 30లోగా నల్లధనాన్ని బహిరంగంగా ప్రకటించకపోతే ఆ తర్వాత పన్నులు, సర్‌చార్జీ, జరిమానాను విధించనున్నట్లు వెల్లడించింది. ఆదాయ పన్ను చట్టప్రకారం ఆదాయం బహిర్గతం చేసిన వారిపై ఎలాంటి చర్యలు, ముఖ్యంగా విచారణ గానీ స్క్రూట్నీ చేయరాదు.

Dhan wapsi from June 1: Govt begins 4 month amnesty for black money

దేశీయంగా పన్ను ఎగనామం పెడుతున్న వారిని దృష్ట్యా ఆర్థిక మంత్రి జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన బడ్జెట్‌లో ఈ స్కీంను ప్రవేశపెట్టారు. గతంలో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో అక్రమంగా దాచి పెట్టిన ఆస్తులను వెల్లడించడానికి ఇలాంటి స్కీంను ప్రవేశపెట్టింది.

బహిర్గతం కాని పలు ఆస్తులపై పెట్టిన పెట్టుబడులు, ఇతర మార్గాల్లో ఇన్వెస్టులకు ఈ స్కీమ్ వర్తించనున్నది. ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా ఆస్తులను వెల్లడించాల్సి ఉంటుందని, లేదంటే జరిమానాతోపాటు విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+