మమత దీదీ జాతక చక్రం తేల్చింది ఇదే- పరాక్రమం

ఇంకొన్ని గంటల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తును ఈ ఫలితాలు నిర్ణయించనున్నాయి. ఎన్నికలకు ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మమతకు అనుకూలంగా లేనప్పటికీ, నాలుగోసారి విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ను అధికార పీఠం నుంచి దించడానికి గట్టి ప్రయత్నాలే చేసింది.

శని అంతర్దశ..

మమత బెనర్జీ నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారా లేదా అనే అంశంపై కాన్పూర్‌ కు చెందిన జ్యోతిష్కురాలు స్వాతి సక్సేనా ఓ విశ్లేషణను వెల్లడించారు. మమత జాతకంలో శని, మంగళ గ్రహాల కలయిక బలమైన ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. కుండలి విశ్లేషణలో.. మమతా బెనర్జీ జాతకంలో ప్రస్తుతం శని అంతర్దశ కొనసాగుతోంది. మంగళ, శని గ్రహాల కలయిక ఆమె 'వ్యయ భావం'లో ఉండటం వల్ల పరాక్రమం బలహీనపడే అవకాశం ఉందని స్వాతి సక్సేనా అభిప్రాయపడ్డారు.

Mamata Banerjee Horoscope Signals Turbulent Times Ahead Operational Strain Intensify as Saturn-Mars Align

మూడుసార్లు మాత్రమే..

ఆమెకు మూడుసార్లు మాత్రమే అధికారం పొందే యోగం ఉందని, నాలుగోసారి అలాంటి అవకాశం లేకపోవచ్చని స్వాతి సక్సేనా అంచనా వేశారు. ఈ గ్రహగతులు ఆమెను ఈసారి ప్రతిపక్ష స్థానంలోకి నెట్టవచ్చని అన్నారు. మమతా బెనర్జీ జన్మ వివరాలపై సందేహాలున్నా, ప్రస్తుత గోచారం, పేరును బట్టి ఆమె రాశి సింహం అవుతుందని స్వాతి సక్సేనా విశ్లేషించారు. సింహ రాశి వారికి అధికారం సులభం కాదని ఆమె అన్నారు.

ఆకస్మిక సవాళ్లు

సింహ రాశిలో కేతువు ఉండటం వల్ల మమతలో అహంకారం పెరిగి, ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చని పేర్కొన్నారు. రాశికి ఎనిమిదో ఇంట మంగళ, శని గ్రహాల కలయిక ఆకస్మిక సవాళ్లను పెంచి, ప్రతికూల పరిస్థితులను సృష్టించగలదని ఆమె వివరించారు. గతంలో మమతా బెనర్జీ అధికార పీఠాన్ని నిలబెట్టుకోవడంలో సూర్యుడు, మంగళ, రాహు గ్రహాల కలయిక సహకరించిందనేది స్వాతి సక్సేనా వాదన.

తూర్పున భారీ రాజకీయ మార్పు

2021 ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ మధ్య తీవ్ర పోటీ ఉన్నా, అప్పట్లో మంగళ గోచారం మమతకు అనుకూలంగా ఉంది. వృషభ రాశిలో రాహువు బలమైన స్థానంలో ఉండటం ఆమెకు పూర్తి బలాన్ని చేకూర్చింది. ఈ కారణాల వల్ల మమత వరుసగా మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుత గోచారం ఆధారంగా దేశ కుండలిని విశ్లేషిస్తే, దేశ తూర్పు ప్రాంతంలో భారీ రాజకీయ మార్పు సంభవించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

రాహు మహాదశ

ప్రస్తుతం దేశ లగ్నమైన వృషభ రాశిలో గోచారం కొనసాగుతుండగా, రాహు మహాదశ నడుస్తోంది. తూర్పు దిశను సూచించే మేష రాశిలో అధికారాన్ని నిర్దేశించే సూర్యుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు. ఈ గ్రహగతులు తూర్పున గణనీయమైన అధికార మార్పునకు స్పష్టమైన సంకేతాలని వారు పేర్కొన్నారు. దేశ తూర్పు భాగంలోని పశ్చిమ బెంగాల్‌లో సాగుతున్న రాజకీయ ప్రకంపనలకు సూర్యుని గోచారం బలాన్ని చేకూరుస్తోంది.

కుంభంలో రాహువు

ప్రస్తుతం దేశం రాహువు మహాదశలో కొనసాగుతోంది. రాహువును పెద్ద మార్పులకు కారకుడిగా పరిగణిస్తారు. దేశ కుండలి కేంద్రంలో పశ్చిమ దిశకు కారక రాశి అయిన కుంభంలో రాహువు ఉండటం వల్ల, పశ్చిమ బెంగాల్ పశ్చిమ భాగంలో గణనీయమైన రాజకీయ మార్పులు సంభవించవచ్చని జ్యోతిష్యులు అభిప్రాయపడ్డారు. మొత్తంగా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి అదృష్టం పెద్దగా సహకరించడం లేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+