రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన సిద్ధరామయ్య- డీకేశి పేరెత్తకుండా

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం తన పదవికి రాజీనామా చేయనున్నారని విస్తృతమైన ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. అయితే, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కుటుంబ అత్యవసర పని నిమిత్తం ముంబై వెళ్లడంతో ఈ అధికారిక ప్రక్రియ సమయంపై ఇంకా అనిశ్చితి నెలకొంది.

ఈ ఉత్కంఠ వాతావరణం మధ్య.. ఈ ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన అధికారిక నివాసంలో అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా మంత్రివర్గ సహచరులు, కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు దీనికి హాజరయ్యారు. ఈ అల్పాహార సమావేశంలో సిద్ధరామయ్యను డీకే శివకుమార్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గౌరవపూరకంగా పాదనమస్కారం చేశారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ దృశ్యాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Siddaramaiah Confirms Resignation as Karnataka Chief Minister Signals Leadership Change in State

ఈ సమావేశం సందర్భంగా సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేయబోతోన్నాననే విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసిందని అన్నారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే పేరును ఆయన వెల్లడించలేదు. మీకందరికీ తెలుసు కదా. నేను ఇప్పుడు చెప్పేది ఏముంది.. అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వడం కనిపించింది. ఒకరిద్దరు మంత్రులు డీకేశికి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ అల్పాహార విందుపై హోమ్ మంత్రి జీ పరమేశ్వర మాట్లాడారు. తన మంత్రివర్గ సహచరులందరికీ ధన్యవాదాలు చెప్పడానికే సిద్ధరామయ్య ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. సిద్ధరామయ్యకు నమ్మినబంట్లుగా పేరున్న మంత్రి ప్రియాంక్ ఖర్గే, హెచ్ కే పాటిల్ వంటి మంత్రులు సైతం దీనికి హాజరయ్యారు. డీకే శివకుమార్ అభ్యర్థిత్వాన్ని వీరంతా ఏకగ్రీవంగా అంగీకరించినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

మరోవంక.. డీకే శివకుమార్ మద్దతుదారులు బెంగళూరులో విజయోత్సవాలను మొదలుపెట్టారు. ఆయన నివాసం ఉన్న సంజయ్ నగర్, మేఖ్రీ సర్కిల్ వద్ద డీకే శివకుమార్ కు చెందిన భారీ బ్యానర్లను కట్టారు. మేఖ్రీ సర్కిల్ నుంచి ఆయన నివాసానికి వెళ్లే మార్గం పొడవునా పోస్టర్లు అతికించారు. ఆయన నివాసం వెలుపల ఈ తెల్లవారు జాము నుంచి బారులు తీరి నిల్చున్నారు. స్వీట్లు పంచి పెట్టారు. డీకేశికి మద్దతుగా నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+