ద్రోణి ప్రభావం, పిడుగులు.. వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!!

వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. మరి కొన్ని జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తాజాగా హెచ్చరికలు చేసింది.

ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరిక చేసింది. నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగుపాటు హెచ్చరిక చేయటంతో పటుగా రాగల మూడు గంటల్లో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 40 నుండి 50 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని సూచించింది. బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

 PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమపై బిగ్ అప్డేట్.. కీలక మార్పులు..!!
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమపై బిగ్ అప్డేట్.. కీలక మార్పులు..!!
apsdma-latest-alerts-over-rains-in-godavari-and-seema-districts-for-next-two-days-issue-orange-ale

రెండు రోజుల పాటు వర్షాలు

ఇదే సమయంలో రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 41.6 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు వడదెబ్బ ప్రభావం ఆందోళన కలిగిస్తోంది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని, తగినంత నీరు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+