పాత బట్టలతో ఇల్లు తుడవొచ్చా? లేదా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
మన ఇళ్లలో పాతబడిన, చిరిగిపోయిన దుస్తులను నేలను తుడిచే గుడ్డగా మార్చడం దశాబ్దాలుగా వస్తున్న ఒక అలవాటు. పాత చీరలు, టీషర్టులు, పిల్లల బట్టలతో ఇళ్లు తుడవడం వల్ల ఖర్చు తగ్గుతుందని చాలామంది భావిస్తారు. అయితే, వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఈ చిన్న అలవాటు ఇంట్లోకి ప్రతికూల శక్తులను ఆహ్వానిస్తుందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల జరిగే నష్టాలను వాస్తు నిపుణుల నుంచి తెలుసుకుందాం.
నెగటివ్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్
చిరిగిన, పాడైపోయిన వస్తువులలో సహజంగానే ప్రతికూల శక్తి దాగి ఉంటుంది.
అలాంటి చిరుగుల బట్టలతో ఇల్లంతా తుడవడం వల్ల,
ఆ నెగటివ్ ఎనర్జీ ఇల్లంతా వ్యాపిస్తుంది.
దీనివల్ల ఇంట్లో అనవసరపు అలసట, నిస్సత్తువ, ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి నెలకొంటాయి.

రాహు దోషం
ముఖ్యంగా పిల్లల చిన్ననాటి బట్టలను నేల తుడవడానికి అస్సలు ఉపయోగించకూడదు.
పిల్లల దుస్తులు వారి అమాయకత్వానికి,
అదృష్టానికి, కుటుంబ ఆనందానికి ప్రతీకలు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇలాంటి బట్టలతో ఇల్లు తుడవడం వల్ల
జాతకంలో రాహు గ్రహం బలహీనపడుతుంది.
రాహువు ప్రభావం తారుమారైతే జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు రావడం,
తీవ్రమైన మానసిక ఒత్తిడి, కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన మనస్పర్థలు తలెత్తుతాయి.
ఆర్థిక ఇబ్బందులు, లక్ష్మీదేవి ఆగ్రహం
పాత, చిరిగిన బట్టలను ఇంట్లో కుప్పలుగా నిల్వ ఉంచడం లేదా
వాటితో ఇళ్లను శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదని నమ్మకం.
ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవడం,
ఊహించని ఖర్చులు రావడం వంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
మరి పాత బట్టలను ఏం చేయాలి?
ఇంట్లో సానుకూల వాతావరణం పెరగాలంటే
పాత దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
పూర్తిగా చిరిగిపోయిన, పనికిరాని దుస్తులను
ఇంట్లో ఎక్కువ కాలం దాచకుండా వెంటనే బయటకు పంపేయాలి.
ఇంకా వేసుకోవడానికి వీలుగా ఉన్న పాత బట్టలను శుభ్రంగా ఉతికి,
లేనివారికి దానం చేయడం వల్ల పుణ్యంతో పాటు జాతకంలో గ్రహాల అనుకూలత పెరుగుతుంది.
ఇల్లు తుడవడానికి మార్కెట్లో దొరికే ప్రత్యేకమైన మాప్‌లు లేదా
మైక్రోఫైబర్ క్లాత్‌లను మాత్రమే ఉపయోగించాలి.
ఇవి ఇంటిని శుభ్రంగా ఉంచడంతో పాటు వాస్తు పరంగా మంచి ఫలితాలను ఇస్తాయి.












Click it and Unblock the Notifications