దేవీశ్రీప్రసాద్ "ఎల్లమ్మ" కోసం మలయాళం స్టార్ బ్యూటీ..
తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు "వేణు". ముఖ్యంగా మున్నా, అతిధి సినిమాలు అతని కెరీర్ కి బాగా కలిసొచ్చాయని చెప్పాలి. ఆ తర్వాత జబర్దస్త్ షో తో బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక రీసెంట్ గానే 'బలగం' చిత్రంతో దర్శకుడిగా మారి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా.. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టడమే కాకుండా అవార్డులను సైతం సొంతం చేసుకుంది.
ఈ క్రమంలోనే వేణు తన నెక్స్ట్ సినిమాని కూడా దిల్ రాజు నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి "ఎల్లమ్మ" అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. ప్రాజెక్టును అనౌన్స్ చేసి మూడేళ్లు కావొస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. మొత్తం 1 నిమిషం 59 సెకన్ల పాటు ఉన్న ఆ వీడియో గ్లింప్స్ ప్యూర్ ట్రాన్స్ లో ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో పర్షి అనే పాత్రలో నటించనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ ఎంపిక మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. గతంలో పలువురు తారల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కీర్తి సురేష్ దాదాపు ఖరారైనట్లు వార్తలు రాగా.. ఇటీవల మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించినట్లు సమాచారం. కానీ ఇప్పుడు 'ప్రేమలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ మల్లూ బ్యూటీ మమితా బైజు పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ నటితో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది.
తప్పుకున్న పలువురు హీరోలు..
కాగా గతంలో ఈ కథ కోసం ముందుగా హీరో నానిని సంప్రదించారు. కానీ ఇతర కమిట్‌మెంట్ల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ చిత్రంలో నితిన్ హీరోగా ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. అధికారికంగా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ అనూహ్యంగా నితిన్ 'తమ్ముడు' సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడం.. బడ్జెట్ సమస్యల కారణంగా నితిన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
ఇక టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న దేవీశ్రీ.. దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తన కెరీరీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా సత్తా చాటిన డీఎస్పీని హీరోగా చూడాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మరి ఈ మూవీతో అయిన దేవి మెప్పిస్తారో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications