వైభవ్ దూకుడుకు బ్రేకులు.. అవుట్ ఎలా చేయాలంటే.. జోఫ్రా ఆర్చర్ సంచలనం..!!
IPL 2026: ఇప్పుడు ఐపీఎల్ లో అందరి నోటా ఒకటే పేరు. వైభవ్ సూర్యవంశీ. ఈ రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రశంసలు అందుకున్నాడు. అయితే, వైభవ్ ను కట్టడి చేయటం పై ప్రత్యర్ధి టీంలు ఆందోళన పడుతుంటే.. సొంత టీం బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఇదే అంశం పై చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి.
వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్ధి టీంలకు సవాల్ గా మారాడు. తాజాగా ఎలిమినేట్ మ్యాచ్ లో వైభవ్ 29 బంతుల్లో 97 పరుగులు చేసి తన టీంను క్వాలిఫయ్యర్ -2 కు చేర్చాడు. ఎన్ని వ్యూహాలు సిద్ధం చేసినా.. వైభవ్ దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో సన్‌రైజర్స్ జట్టు పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో వైభవ్‌ను ఎలా కట్టడి చేయొచ్చనే ప్రశ్నకు రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన నాక్ ఆడాడు. ఇలా దూకుడుగా ఆడి పరుగులు చేస్తే మాకు డిఫెండ్ చేయడానికి కాస్త ఈజీగా ఉంటుంది. వైభవ్ ఎలాంటి బంతి సంధించినా బౌండరీకి పంపేస్తాడు. అదే అతడి స్పెషాలిటీ. సులువుగా 150 పరుగులు కూడా చేయగలడు' అంటూ ఆర్చర్.. వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ తర్వాత వైభవ్ దూకుడును ఎలా ఆపాలి? అంటూ ఎదురైన ప్రశ్నకు ఆర్చర్ సరదాగా సమాధానం ఇచ్చాడు.

వైరల్ అవుతున్న జోఫ్రా ఆర్చర్ వ్యాఖ్యలు
ఇప్పుడు ఆర్చర్ సమాధానం వైరల్ అవుతోంది. 'అతడికి ఎక్కడ బౌలింగ్ చేస్తే ఔట్ అవుతాడో నాకు తెలుసు. వైభవ్ దూకుడును ఆపేందుకు ఓ టెక్నిక్ ఉంది. కానీ ఇప్పుడే చెప్పను. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఈ ప్రశ్నకి సమాధానం చెబుతాను' అంటూ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీంలో మరో ప్లేయర్ ధ్రువ్ జురెల్ సైతం వైభవ్ ఆట పైన స్పందించాడు. 'వైభవ్ ప్రత్యేకత ఏమిటంటే అతడు ఎక్కువగా ప్లాన్ చేయడు. నెట్స్‌లో చాలా కష్టపడతాడు. తనపై అతడికి అపారమైన నమ్మకం ఉంటుంది. 'నేను చేయలేను' అనే సందేహం అతడిలో అసలు ఉండదు. అకాడమీలో చిన్నప్పటి నుంచే బౌలర్‌ను కాదు.. బంతిని చూడాలని చెబుతారు. కానీ మేమంతా బౌలర్ వైపే ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్లం. వైభవ్ మాత్రం కేవలం బంతినే చూస్తాడు. అతడికి ప్రత్యర్థి బౌలర్ ఎంత సీనియర్ అయినా అవేం పట్టించుకోడు. బౌలర్‌ను కాకుండా బంతిని చూస్తాడని చెప్పుకొచ్చాడు.













Click it and Unblock the Notifications