మామిడి పండ్లపై నిషేధం, 20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే దెబ్బ..

రుచికరమైన భారతీయ మామిడి పండ్ల ప్రియులకు, ముఖ్యంగా దేశీయ ఎగుమతిదారులకు జపాన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. 2026 మామిడి సీజన్‌కు సంబంధించి భారతదేశం నుండి తాజా మామిడి పండ్ల దిగుమతులను జపాన్ తక్షణమే నిలిపివేసింది. భారతీయ చికిత్సా కేంద్రాలలో (Treatment Facilities) ఫ్యూమిగేషన్, క్రిమిసంహారక చర్యలలో తీవ్ర లోపాలు ఉన్నట్లు జపాన్ క్వారంటైన్ తనిఖీ అధికారులు కనుగొనడమే ఈ కఠిన నిర్ణయానికి కారణమైంది.

గతంలో 1986లో పండ్ల ఈగలు వ్యాప్తి చెందుతాయనే నెపంతో భారతీయ మామిళ్లపై జపాన్ ఏకంగా 20 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఆ తర్వాత సుదీర్ఘ చర్చల అనంతరం జూన్ 23, 2006న ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. అప్పట్లో ఇది "ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రతీక"గా నిలిచింది. అయితే, ఆ తర్వాత గత రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ లేని విధంగా, మళ్లీ 20 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో భారతీయ మామిడి దిగుమతులకు జపాన్ బ్రేక్ వేయడం ఇదే మొదటిసారి.

Japan Bans Indian Mango Imports For 2026 Season Citing Crucial Tech Faults In VHT Fumigation Facilities

ఏప్రిల్ - జూన్ పీక్ సీజన్‌కే గండి!

ఈ ఆకస్మిక నిలిపివేత వల్ల అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్న మన ఆల్ఫాన్సో, కేసర్, లంగ్రా, బంగినపల్లి వంటి ప్రధాన నాలుగు మామిడి రకాల ఎగుమతులు నిలిచిపోయాయి. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండే అత్యంత కీలకమైన పీక్ ఎగుమతి సమయాన్నే ఈ నిషేధం తాకడం వల్ల భారతీయ ఎగుమతిదారులు భారీగా ఆర్థిక నష్టాలను చవిచూడబోతున్నారు. యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ జారీ చేసిన నోటీసు ప్రకారం.. మార్చి 25, 2026 లేదా ఆ తర్వాత భారత్ నుండి జారీ చేయబడిన తనిఖీ ధ్రువపత్రాలు కలిగిన ఏ ఒక్క మామిడి సరుకును కూడా జపాన్ ఆమోదించదు.

జార్జ్ బుష్‌ను పిచ్చెక్కించిన మన 'ఆల్ఫోన్సో'..మామిడి దౌత్యం అంటే ఇదే!
జార్జ్ బుష్‌ను పిచ్చెక్కించిన మన 'ఆల్ఫోన్సో'..మామిడి దౌత్యం అంటే ఇదే!

యూపీలోని ప్లాంట్‌లో సాంకేతిక లోపాలు

నిబంధనల ప్రకారం.. జపాన్‌కు ఎగుమతి చేసే ప్రతి మామిడి కాయను రసాయన రహితమైన 'వేపర్ హీట్ ట్రీట్‌మెంట్' (VHT) ప్రక్రియకు గురిచేయాలి. ప్రతి ఏటా జపాన్ క్వారంటైన్ అధికారులు భారత్‌కు వచ్చి ఈ ప్లాంట్లను తనిఖీ చేస్తారు. ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని రెహమాన్‌పూర్‌లో ఉన్న VHT సౌకర్యాన్ని జపాన్ అధికారులు తనిఖీ చేసినప్పుడు, అక్కడ ఫ్యూమిగేషన్ ప్రొటోకాల్స్, క్రిమిసంహారక చర్యలలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సాంకేతిక లోపాలు ఏమిటనేది ఇరు దేశాలు బహిరంగపరచకపోయినప్పటికీ.. ఈ లోపాలను సరిదిద్ది, తమ క్వారంటైన్ ప్రమాణాలు మెరుగుపడ్డాయని జపాన్ అధికారులు సంతృప్తి చెందే వరకు దిగుమతుల పునరుద్ధరణ జరగదని నోటీసులో స్పష్టం చేశారు.

ఆర్థికంగా సవాలుతో కూడిన సమయం..

నిజానికి భారతదేశానికి జపాన్ ప్రాథమిక మార్కెట్ కాదు. మన దేశం నుంచి ఎక్కువ శాతం మామిళ్లు యూఏఈ, అమెరికా, బ్రిటన్, కువైట్, ఖతార్ దేశాలకు ఎగుమతి అవుతాయి. గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) భారత్ $56.50 మిలియన్ల విలువైన మామిడి పండ్లను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసింది. అయితే, జపాన్‌కు జరిగే $1.54 మిలియన్ల ఎగుమతి వాటా చిన్నదైనప్పటికీ, అక్కడ లభించే ప్రీమియం ధరల వల్ల ఎగుమతిదారులకు ఇది అత్యంత లాభదాయకమైన మార్కెట్.

Mango Rates: రైతులకు పండగే ఇంక.. తోతాపురి మామిడికి మార్కెట్‌లో రికార్డ్ రేట్లు!
Mango Rates: రైతులకు పండగే ఇంక.. తోతాపురి మామిడికి మార్కెట్‌లో రికార్డ్ రేట్లు!

కొంకణ్ ప్రాంతంలో నిరంతర వేడిగాలుల కారణంగా ఈసారి ఆల్ఫాన్సో పంట ఇప్పటికే దెబ్బతింది. దీనికి తోడు పశ్చిమ ఆసియాలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ రవాణా (లాజిస్టిక్స్) ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో జపాన్ తీసుకున్న నిర్ణయం ఎగుమతిదారులను మరింత కుంగదీస్తోంది. ప్రస్తుతానికి భారత ప్రభుత్వ విభాగమైన అపెడా (APEDA) గానీ, జపాన్ అధికారులు గానీ దీనిపై తదుపరి చర్చల కాలపరిమితిని ప్రకటించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+