రాష్ట్రంలో రెండో రాజధాని: సీఎం అనూహ్య నిర్ణయం..
70లక్షల అతి తక్కువ జనాభా ఉన్న హిమాచల్ ప్రదేశ్ కు రెండో రాజధాని అవసరమా? అంటే.. దానికి కూడా వీరభద్రసింగ్ సమాధానం చెబతున్నారు.
షిమ్లా: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రభుత్వాలు కొత్త హామీలను తెరమీదకు తీసుకురావడం షరా మామూలే. అయితే ఆ నిర్ణయాలు నిజంగా ప్రజాభివృద్దికి దోహదం చేయగలిగితే వాటిని శంకించాల్సిన అవసరం లేదు.
తాజాగా హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి రెండో రాజధాని అవసరముందంటున్న ఆయన.. ధర్మశాలను రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కు షిమ్లా రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే.
కాగా, ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాల్సి ఉండటంతో.. వీరభద్రసింగ్ తీసుకున్న నిర్ణయం ప్రజలను ఆకర్షించడానికే అన్న వాదన కూడా వినిపిస్తోంది. 70లక్షల అతి తక్కువ జనాభా ఉన్న హిమాచల్ ప్రదేశ్ కు రెండో రాజధాని అవసరమా? అంటే.. దానికి కూడా వీరభద్రసింగ్ సమాధానం చెబతున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 25సీట్లు ధర్మశాల పరిధిలోనే ఉండటం గమనార్హం. ఇక్కడి ప్రాంతవాసులకు షిమ్లా దూరంగా ఉండటంతో ముఖ్య పనుల కోసం చాలా దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ధర్మశాలను రెండో రాజధానిగా చేస్తే.. దానికున్న చారిత్రక నేపథ్యం కూడా పర్యాటకంగా ఉపయోగపడుతుందని వీరభద్రసింగ్ తెలిపారు.
ధర్మశాలలో బౌద్ద గురువు దలైలామా ఆశ్రమం ఉన్న సంగతి తెలిసిందే. ప్రకృతి అనుకూలతతో పాటు అడ్వంచర్ టూరిజానికి కేంద్రంగా ధర్మశాల ఉండటంతో.. రెండో రాజధాని నిర్ణయం రాష్ట్రాభివృద్దికి దోహదం చేస్తుంది.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications