ప్రధాని మోడీతో పన్నీర్ సెల్వం భేటీ, సీఎంను వదిలేసి ఒంటరిగా ఢిల్లీ వెళ్లిన డీసీఎం !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీతో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీలో మోడీని ఆయన అధికారిక నివాసంలో కలిసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

మోడీతో భేటీ అయిన తరువాత ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మధ్య ఎలాంటి అభిప్రాయ విభేదాలు లేవని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాల విలీనం విషయంలో తాను ఎలాంటి షరతులు విధించలేదని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు.

Dharmayudham is over we have merged says Panneerselvam

తాను చేపట్టిన ధర్మయుద్ధం విలీనంతో ముగిసిందని పన్నీర్ సెల్వం అన్నారు తమిళనాడులో విద్యుత్ ఉత్పత్తి చెయ్యడానికి బోగ్గు ఖనిజం తక్కువగా ఉందని, పవర్ ప్లాంట్ ఏర్పాటు చెయ్యడానికి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీకి మనవి చేశామని, అందుకు ఆయన సానుకూలంగా స్పంధించారని పన్నీర్ సెల్వం చెప్పారు.

తమిళనాడులో డెంగ్యూ వ్యాది విస్తరిస్తున్న విషయం, ప్రభుత్వం వ్యాదిని అరికడుతున్న విషయం ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పామని, పూర్తి వివరాలు తెలుసుకున్న ఆయన తమిళనాడుకు వైద్య నిపుణులను పంపిస్తామని హామీ ఇచ్చారని పన్నీర్ సెల్వం వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu Deputy Chief Minister O. Panneerselvam on Thursday met Prime Minister Narendra Modi. OPS says DharmaYudham ended and it had no conditions for merger. Result of DharmaYudham is merger he says.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి