వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోలీపై దియా మీర్జా వివాదాస్పదం: క్షమాపణలు

|
Google Oneindia TeluguNews

ముంబై: హోలీ పండగపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి దియా మీర్జా అనంతరం తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని కోరారు. 'నా వ్యాఖ్యలతో మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి.. మనసు చలించిపోయి అలా మాట్లాడాను'అని పేర్కొంది.

కొద్ది రోజుల క్రితం హోలీ పండగపై దియా చేసిన ట్వీట్‌ విమర్శలకు దారితీసింది. దీంతో తన వ్యాఖ్యల వెనుక ఉన్న విషయాన్ని దియా తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులకు వివరించారు.

'ఓ పక్క కరవుతో రైతుల ఆత్మహత్య చేసుకుంటుంటే.. కొందరేమో హోలీ అంటూ నీటిని వృథా చేస్తున్నారు. అలాంటి ప్రాంతంలో మనం జీవిస్తున్నాం. ఇలా అంటున్నందుకు నన్ను హిందూ వ్యతిరేకి అనండి' అంటూ దియా కొద్ది రోజుల క్రితం ట్వీట్‌ చేశారు.

 Dia Mirza on her ‘dry Holi’ tweet, issues statement on Facebook

అయితే దీనిపై విమర్శలు రావడంతో హోలీ పర్వదినాన తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు దియా. తన వ్యాఖ్యలతో ఎవరి నమ్మకాలనైనా కించపరిచినట్లయితే.. క్షమించాలని కోరారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపైనే తాను వ్యాఖ్యానించానని వివరణ ఇచ్చారు.

'నాకు అన్నిమతాల మీద సమాన గౌరవం ఉందని, అయితే దేశంలో అనేక
ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకొచ్చారు. నీరు లేక పంటలు పండటం లేదని, అందువల్ల చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు' దియా మీర్జా చెప్పుకొచ్చారు. దియా వ్యాఖ్యలను కొందరు సమర్థించగా, మరికొందరు తప్పుబట్టారు.

కాగా, చిన్నతనంలో తానూహోలీ అంటూ చాలా నీటిని వృథా చేశానని, అయితే ఇప్పుడు దాని విలువ తెలుస్తోందని దియా తెలిపారు. మనమంతా నీటి కొరత సమస్యను పూర్తిగా తొలగించకపోవచ్చు, కానీ ఓ పౌరుడిగా దాన్ని అరికట్టేందుకు మనవంతుకృషి చేయాలని కోరారు.

Let me start by saying to all those who have taken strong offense to my tweet - "The irony of the times we live in:...

Posted by Dia Mirza on Monday, March 21, 2016

English summary
Bollywood actress Dia Mirza has opened up about her controversial tweet that faced outrage from a lot of users on Twitter. Apologizing for her tweet, Dia said she did not have any intention to hurt any community and she just called for water conservation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X