సుప్రీంలో దొరికిపోయిన సీఈసీ..! వెబ్ సైట్లో వివరణ మాయం.! సీజేపీ చెడుగుడు..!
కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం (ECI) వాడుతున్న ఫారం 6లో ఈసారి చేసిన మార్పులు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. వీటిలో గత ఎస్ఐఆర్ లో తాతలు, తండ్రుల వివరాలు కూడా ఇస్తేనే ఫారం 6 (Form 6) ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామంటూ ఈసీ పెట్టిన రూల్ కలకలం రేపింది. దీనిపై ఈసీలో ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం తెలిపారు. అయినా సీఈసీ జ్ఞానేష్ కుమార్ మాత్రం వెనక్క తగ్గలేదు. తాజాగా ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ దీనిపై పరిశోధనాత్మక కథనం ప్రచురించిన తర్వాత ఈసీ దీన్ని సుప్రీంకోర్టు ఆమోదించినట్లు చెప్పి సమర్ధించుకుంది.
అయితే ఇవాళ మాత్రం ఈ వ్యవహారంలో భారీ ట్విస్ట్ ఎదురైంది. ఫామ్ 6లో ఎన్నికల సంఘం చేసిన సవరణలకు తమ ఆమోదం లేదంటూ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తేల్చిచెప్పేశారు. దీంతో ఈసీ సుప్రీంకోర్టులో దొరికిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈసీ ఫామ్ 6 మార్పులు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే చేశామంటూ ఇచ్చిన వివరణ కోసం ఈసీ వెబ్ సైట్ లో జనం వెతికారు. కానీ ఆ ప్రకటనను ఈసీ వెబ్ సైట్ లో నుంచి తీసేసినట్లు తెలుస్తోంది. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్రంగా మండిపడింది.

🚨Important 🚨This is huge. CJI has just claimed that the modified Form 6 wasn’t approved by the SC.This is in direct contradiction to the ECI press release on Sept 26, which claimed that the Form 6 declarations had been upheld by the SC. Remember, Form 6 is the one used for new voter registration, where arbitrary declaration had been added unilaterally by Gyanesh.More interestingly, the Sept 26th press release is no longer available on the ECI website.Did the CEC just officially lie to the people of this country?
— Ashutosh Ranka (@AshutoshRanka) October 5, 2026
ఇది చాలా పెద్ద విషయమని, సవరించిన ఫారం 6కు సుప్రీంకోర్టు ఆమోదం తెలపలేదని సీజేఐ ఇప్పుడే పేర్కొన్నారని గుర్తుచేసింది. ఫారం 6లోని ప్రకటనలను సుప్రీంకోర్టు సమర్థించిందని పేర్కొన్న సెప్టెంబర్ 26 నాటి ఈసీ పత్రికా ప్రకటనకు ఇది పూర్తిగా విరుద్ధమని గుర్తుంచుకోవాలని సీజేపీ నేత అశుతోష్ రాంకా తెలిపారు. కొత్త ఓటరు నమోదు కోసం ఉపయోగించేది ఫారం 6 అని, దీనిలో జ్ఞానేష్ ఏకపక్షంగా, ఇష్టానుసారంగా ఒక ప్రకటనను చేర్చారని ఆయన ఆరోపంచారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 26 నాటి పత్రికా ప్రకటన ఇప్పుడు ఈసీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో లేదన్నారు. అంటే సీఈసీ ఈ దేశ ప్రజలకు అధికారికంగా అబద్ధం చెప్పారా అని ఆయన ప్రశ్నించారు. దీంతో సీఈసీ ఈ విషయంలో సుప్రీంకోర్టుతో పాటు దేశ ప్రజలకు కూడా దొరికిపోయినట్లయింది. ఈ నేపథ్యంలో ఈసీ త్వరలో సుప్రీంకోర్టుకు ఇవ్వబోతున్న వివరణపై ఉత్కంఠ నెలకొంది.
Hilarious 😂.ECI has apparently taken down the Sept 26 press release, which claimed that SC had upheld the Form 6 order.Gyanesh has been thrown under the bus.Gyanesh, it’s done bro! https://t.co/IBslpELDVe
— Ashutosh Ranka (@AshutoshRanka) October 5, 2026
ఫామ్ 6లో చేసిన మార్పులు ఎవరి ప్రమేయంతో జరిగాాయన్న దానిపై రికార్డులు పరిశీలించాక తేలుస్తామంటూ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఈసీకి ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే ఇప్పటికే సీఈసీ జ్ఢానేష్ రాజీనామా కోసం జరుగుతున్న ఆందోళనలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications
