యెడ్యూరప్పకు అమిత్ షా షాక్! సన్నిహితురాలు శోభాకందర్లాజేకు నో టిక్కెట్

బెంగళూరు: బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు అధిష్టానం షాకిచ్చింది. ఆమెకు సన్నిహితురాలైన శోభా కందర్లాజేకు పార్టీ అధిష్టానం టిక్కెట్ నిరాకరించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో శోభ పేరు లేదు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.

మొత్తం 225 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు 219 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. శోభా కందర్లాజే ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె ఉవ్వీళ్లూరుతున్నారు. విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు.

Disappointment for Shobha Karandlaje, BJP gives actor Jaggesh ticket to Yeshvanthpur

గతంలో యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్లో మంత్రిగా పని చేశారు. జగదీష్ శెట్టార్ ప్రభుత్వంలోను మంత్రిగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె పేరుకు ఎక్కడా చోటు కల్పించలేదు. తన మద్దతుదారు అయిన శోభాకు టిక్కెట్ రాకపోవడం యెడ్డీకి షాక్ అంటున్నారు.

ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసిన బీజేపీ సోమవారం నాలుగో జాబితా విడుదల చేసింది. ఇందులోనైనా శోభా కందర్లాజే పేరు ఉంటుందని భావించారు. మరోవైపు యెశ్వంతపూర్ నుంచి ప్రముఖ శాండిల్ వుడ్ నటుడు జగ్గేష్‌కు టిక్కెట్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+