వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

41% తగ్గిన డిస్కంల నష్టాలు, కారణమిదే!

కేంద్ర ప్రభుత్వం విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు ప్రవేశపెట్టిన ఉదయ్‌ స్కీమ్ సత్పలితాలను సాధిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని డిస్కంల నష్టాలు 41 శాతం తగ్గినట్టుగా కేంద్రం ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు ప్రవేశపెట్టిన ఉదయ్‌ స్కీమ్ సత్పలితాలను సాధిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని డిస్కంల నష్టాలు 41 శాతం తగ్గినట్టుగా కేంద్రం ప్రకటించింది. దేశంలో అత్యధికంగా నష్టాల్లో ఉన్న డిస్కం కంపెనీలు కూడ ఈ స్కీమ్‌లో చేరడం వల్ల తమ నష్టాలను 60 నుండి 70 శాతానికి తగ్గాయి.

దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్ అందించాలనే కేంద్రం భావిస్తోంది. అయితే అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లోని డిస్కం కంపెనీల నష్టాలను తగ్గించేందుకుగాను కేంద్రం కొత్తగా ఉదయ్ స్కీమ్‌ను తెచ్చింది. ఈ స్కీమ్ కారణంగా నష్టాల్లో ఉన్న డిస్కంలు గణనీయంగా నష్టాలను తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

discom Losses reduced by 41%

ఈ స్కీమ్‌లో చేరకముందు ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లోని డిస్కం కంపెనీలు ఎక్కువ నష్టాల్లో ఉండేవి. అయితే ఈ స్కీమ్‌లో చేరిన తర్వాత నష్టాలు గణనీయంగా తగ్గిపోయాయి.ఈ మూడు రాష్ట్రాల్లోని డిస్కంలు 60 నుండి 70 శాతం నష్టాలను తగ్గించుకొన్నాయి. హర్యానా రాష్ట్రానికి చెందిన డిస్కం కంపెనీ 90 శాతానికి పైగా నష్టాలను తగ్గించుకొంది.

దేశంలోని 18,452 గ్రామాలకు విద్యుద్దీకరణ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే 13,511 గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ ఏడాది మే వరకు విద్యుద్దీకరణ చేశారు. 2015 లో విద్యుత్ సౌకర్యం కల్పించే విషయంలో భారత్ ర్యాంకు 99గా ఉండేది. అయితే ఈ ఏడాది మే నాటికి 13,511 గ్రామాలకు విద్యుద్దీకరణ చేయడంతో ప్రపంచబ్యాంకు నివేదికలో తన ర్యాంకును భారత్ మెరుగుపర్చుకొంది.

ఉదయ్‌స్కీమ్‌లో చేరిన తర్వాత ఆయా రాష్ట్రాల్లోని డిస్కంల గణాంకాలు ఇలాల ఉన్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో 2013లో ఆడిట్ విభాగంలో 9,778 కోట్లు, 2014 లో16,774 కోట్లు,2015లో 8,765 కోట్లు, ఆన్అడిట్ విభాగంలో 2016లో7,689 కోట్లు, 2017లో6,619 కోట్లకు చేరుకొంది.రాజస్థాన్ 2013లో ఆడిట్ విభాగంలో 12,351 కోట్లు, 2014 లో15,645 కోట్లు,2015లో 12,471 కోట్లు, ఆన్అడిట్ విభాగంలో 2016లో11,241కోట్లు, 2017లో5,208 కోట్లకు చేరుకొంది.మధ్యప్రదేశ్‌లో 2013లో ఆడిట్ విభాగంలో 4450 కోట్లు, 2014 లో6,370 కోట్లు,2015లో 4,950కోట్లు, ఆన్అడిట్ విభాగంలో 2016లో5,751కోట్లు, 2017లో4,813 కోట్లకు చేరుకొంది.

discom Losses reduced by 41%

ఇక తమిళనాడు రాష్ట్రానికి వస్తే 2013లో ఆడిట్ విభాగంలో 11,679 కోట్లు, 2014 లో13,985కోట్లు,2015లో 12,757కోట్లు, ఆన్అడిట్ విభాగంలో 2016లో5,787కోట్లు, 2017లో3,783 కోట్లకు చేరుకొంది.జమ్మూకాశ్మీర్‌లో ఆడిట్ విభాగంలో 3,129 కోట్లు, 2014 లో2,387కోట్లు,2015లో3,913కోట్లు, ఆన్అడిట్ విభాగంలో 2016లో4,532కోట్లు, 2017లో3,368 కోట్లకు చేరుకొంది.మహరాష్ట్రలో ఆడిట్ విభాగంలో 871 కోట్లు, 2014 లో280 కోట్లు,2015లో366కోట్లు, ఆన్అడిట్ విభాగంలో 2016లో2794కోట్లు, 2017లో2568 కోట్లకు చేరుకొంది.

పంజాబ్‌లో ఆడిట్ విభాగంలో261 కోట్లు, 2014 లో249 కోట్లు,2015లో133కోట్లు, ఆన్అడిట్ విభాగంలో 2016లో1989కోట్లు, 2017లో2386 కోట్లకు చేరుకొంది.జార్ఖండ్‌లో ఆడిట్ విభాగంలో2668 కోట్లు, 2014 లో4021కోట్లు,2015లో37కోట్లు, ఆన్అడిట్ విభాగంలో 2016లో1161కోట్లు, 2017లో2001 కోట్లకు చేరుకొంది.బీహార్‌లో ఆడిట్ విభాగంలో1227 కోట్లు, 2014 లో343కోట్లు,2015లో1044కోట్లు, ఆన్అడిట్ విభాగంలో 2016లో1074కోట్లు, 2017లో1641 కోట్లకు చేరుకొంది.హర్యానాలో ఆడిట్ విభాగంలో3649 కోట్లు, 2014 లో3554కోట్లు,2015లో21174కోట్లు, ఆన్అడిట్ విభాగంలో 2016లో808కోట్లు, 2017లో387 కోట్లకు చేరుకొంది.ఇతర రాష్ట్రాల్లో ఆడిట్ విభాగంలో20544 కోట్లు, 2014 లో3233కోట్లు,2015లో8625కోట్లు, ఆన్అడిట్ విభాగంలో 2016లో8514కోట్లు, 2017లో7521 కోట్లకు చేరుకొంది.
మరోవైపు సోలార్, పవన్ విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గాయి. పవన్ విద్యుత్‌కు అత్యధికంగా యూనిట్‌కు రూ.3.46 ఖర్చు అవుతోంది. దేశవ్యాప్తంగా 56 కోట్ల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశారు. 23 కోట్ల బల్బులను ఉజల పథకం కింద పంపిణీచేశారు. మరో22 కోట్ల ప్రైవేట్ సెక్టార్ కింద పంపిణీ చేయనున్నారు.

అదేవిధంగా 18.5 ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లను పంపిణీ చేశారు. మరో వైపు 20 లక్షల ఎల్ఈడీ వీధిదీపాలను కూడ ఏర్పాటుచేశారు.

English summary
Power Ministry has got success to save the power worth Rs. 29,000 crore. This is a big achievement that overall DISCOM losses reduced by 41% under this govt.Under UDAY, high loss making States like UP, Rajasthan & TN have decreased their losses by 60 to 70 percent while Haryana has reduced losses by 90%.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X