Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూర్గ్.. మిస్ కావొద్దు బాస్: దసరా సెలవుల్లో బెస్ట్ ఫ్యామిలీ ట్రిప్..

కర్ణాటకలోని అందమైన ప్రదేశాల్లో ఒకటి.. కూర్గ్‌. Scotland of Indiaగా పిలుస్తారు. ఇక్కడి పొగమంచుతో కూడిన కొండలు, సుందరమైన కాఫీ తోటలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కుటుంబంతో కలిసి వెళ్లే వారికి కూర్గ్ ప్రకృతి సౌందర్యాన్ని మాత్రమే కాదు, విభిన్న అనుభూతులను పంచుతుంది. అడ్వెంచర్, ట్రెక్కింగ్, కల్చరల్.. ఇలా మరపురాని జ్ఞాపకాలను పదిలపర్చుకోవచ్చు. ఎప్పుడైనా కూర్గ్ కు వెళ్లొచ్చు. వర్షకాలం, చలికాలంలో వెళ్తే అక్కడి ప్రకృతి సౌందర్యం రెట్టింపు అవుతుంది.

దీన్ని కొడగు అని కూడా పిలుస్తారు. సముద్రమట్టానికి ఈ ప్రాంతం దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బెంగళూరు నుంచి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్క‌డి చుట్టూ దట్టమైన అడవులు, అందమైన జలపాతాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఇక్క‌డి కాఫీ, టీ, మసాలా దినుసులను పండించే తోటలు నిత్యం పర్యాటకుల్ని అకర్షిస్తుంటాయి. ఈ హిల్‌స్టేషన్ శీతాకాలంలో ద‌ట్ట‌మైన‌ పొగమంచు అందాలతో మరింత సుందరంగా ఉంటుంది.

Discover the Untamed Beauty of Coorg Your Ultimate Wildlife Adventure Awaits

అతితక్కువ బడ్జెట్‌లో ఎక్క‌డికైనా వెళ్లాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్రాంతాన్నిఎంపిక చేసుకోవ‌చ్చు. అచ్చం స్కాట్లాండ్​లో ఉన్నట్టే ఇక్కడి ల్యాండ్ స్కేపింగ్ ఉంటుంది. పచ్చదనం నిండివుంటుంది. రకరకాల పూల మొక్కలు, చెట్లు, లోయలు ఎన్నో పర్యాటకులను కనువిందు చేస్తుంటాయి. రివర్ రాఫ్టింగ్, అడవుల్లో జిప్-లైనింగ్, పర్వతాలను అధిరోహించడం.. ఇక్కడి ప్రత్యేకత. దగ్గర్లోనే దుబారే ఎలిఫెంట్ క్యాంపును సందర్శించడం తప్పనిసరి.

1. అబ్బే వాటర్ ఫాల్స్..

మడికేరి పట్టణం నుండి ఒక కిలో మీటర్ దూరంలో ఉన్న అబ్బే జలపాతం సహజ సౌందర్యానికి ప్రసిద్ధి. దీని చుట్టూ కాఫీ, సుగంధ ద్రవ్యాల తోటలు ఉంటాయి. జలపాత హోరు మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. దీన్ని చూడటానికి సెప్టెంబర్-డిసెంబర్ అనుకూలమైన సమయం.

Discover the Untamed Beauty of Coorg Your Ultimate Wildlife Adventure Awaits

2. చిక్లిహోలె రిజర్వాయర్

మడికేరి, కుశాలనగర మధ్య ఉన్న రిజర్వాయర్ ఇది. పర్యాటకుల రద్దీ నుండి దూరంగా ప్రశాంతతను కోరుకునే వారికి అనుకూలం. కుశాలనగరకు సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ రిజర్వాయర్ కావేరి నదిపై నిర్మించారు. చుట్టూ దట్టమైన అటవీప్రాంతం ఉంటుంది. ఇక్కడ సూర్యాస్తమయం మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ ప్రాంతంలో దుకాణాలు లేనందున పర్యాటకులు తమతో పాటు అవసరమైన వస్తువులను తీసుకెళ్లడం మంచిది. జూన్ నుండి మార్చి వరకు అంటే వర్షాకాలం, శీతాకాలంలో సందర్శించడానికి ఇది అనుకూలమైన సమయం.

3. దుబారే ఎలిఫెంట్ క్యాంప్

కావేరీ నది ఒడ్డున ఉంటుందీ దుబారే ఎలిఫెంట్ క్యాంప్. ఏనుగుల మధ్య పర్యాటకులు గడపవచ్చు. ఏనుగులపై సవారీ ఇక్కడి ప్రత్యేకత. ఏనుగులపై జంగిల్ రైడ్‌ చేయవచ్చు. ఈ క్యాంప్‌లో పర్యాటకులు స్వయంగా ఏనుగులను స్నానం చేయించడానికి అనుమతి ఉంది. ఎలిఫెంట్ సఫారీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

4. మందాలపట్టి హిల్..

అబ్బే వాటర్ ఫాల్స్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మందాలపట్టి హిల్. ట్రెకింగ్ ప్రియులకు స్వర్గధామం. ట్రెకింగ్‌కు వెళ్లాలంటే బేస్ వద్ద ఉన్న అధికారుల నుండి ప్రవేశ టిక్కెట్లను తీసుకోవాలి. ఎత్తయిన కొండ ప్రాంతం కావడం వల్ల పర్యాటకులు నీరు, ఆహారం, ఇతర ట్రెకింగ్ వస్తువులను తీసుకెళ్లడం మంచిది. బస్సు సర్వీసులు లేవు. ప్రైవేట్ వాహనాన్ని అద్దెకు తీసుకోవాలి. వర్షాకాలంలో అంత సురక్షితం కాదీ ట్రెక్కింగ. నవంబర్ నుండి జనవరి వరకు సందర్శించడం మంచిది.

Discover the Untamed Beauty of Coorg Your Ultimate Wildlife Adventure Awaits

5. రాజా సీట్..

మడికేరి పట్టణంలో ఉన్న రాజా సీటు నుంచి పశ్చిమ కనుమల సౌందర్యాన్ని వీక్షించవచ్చు. కూర్గ్ రాజులకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఇది. పూర్వకాలంలో కూర్గ్ రాజులు తరచూ ఈ ప్రదేశాన్ని సందర్శించేవారు. అందుకే దానికి ఈ పేరు వచ్చింది. సూర్యోదయాస్త సమయాలు అద్భుతంగా ఉంటాయి ఇక్కడ. దీన్ని తప్పకుండా చూడాలి.

కూర్గ్ కు ఎలా చేరుకోవాలి..

  • విమానంలో: కూర్గ్ కు సమీప విమానాశ్రయం కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం. సుమారు 120 కి.మీ. దూరంలో ఉంటుంది. మంగళూరు.. ఇక్కడికి దగ్గరలో ఉన్న మరో ఎయిర్ పోర్ట్. సుమారు 160 కి.మీ. దూరం. బెంగళూరు నుంచి 280 కి.మీ. ట్రావెల్ చేయాల్సి ఉంటుంది.
  • రైలులో: కూర్గ్ కు రైలు మార్గం లేదు. సమీప రైల్వే స్టేషన్ మైసూరు. సుమారు 95 కి.మీ. దూరంలో ఉంది. లేదంటే హాసన్- 100, మంగళూరు- 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర రైల్వే స్టేషన్లు.
  • రోడ్డు ద్వారా: కూర్గ్ కు మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది. బెంగళూరు, మైసూరు నుండి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+