
Dispute: కజిన్ ను కిడ్నాప్ చేసి తల నరికేశాడు, తల చేతిలో పట్టుకుని సెల్ఫీలు, అడవిలో మొండెం !
రాంఛీ/జార్ఖండ్: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న దగ్గర బంధువులకు చాలా సంవత్సరాల నుంచి భూముల విషయంలో గొడవలు జరుుతున్నాయి. కుటుంబ సభ్యులు అందరూ పొలంలో పనులు చెయ్యడానికి వెళ్లారు. ఇంట్లో ఉన్న యువకుడిని కొందరు కిడ్నాప్ చేశారు. తరువాత కిడ్నాప్ అయిన యువకుడి మొండెం అటవి ప్రాంతంలో కనపడింది. 15 కిలోమీటర్ల దూరంలో అతని తల కనపడింది. కజిన్ బ్రదర్ ను కసితీరా తల నరికి చంపిన యువకుడు ఆ తల చేతిలో పట్టుకుని అతని స్నేహితులతో కలసి సెల్ఫీలు తీసుకోవడం కలకలం రేపింది.
Lady: ఇంట్లో ఒంటరిగా ఉందని ఏం చేశారంటే ?, ప్రైవేట్ పార్ట్స్ మీద ?, వీడియోలు తీసి !

ఆస్తుల కోసం గొడవలు
జార్ఖండ్ లోని ఖుంటి జిల్లాలోని ముర్హు ప్రాంతంలో దాసాయి ముండా అలియాస్ దాసాయి (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. దాసాయి ముండాకు కను ముండా (24) అనే కుమారుడు ఉన్నాడు. దాసాయి ముండాకు, అదే గ్రామంలో నివాసం ఉంటున్న వరుసకు బావ అయ్యే కుటుంబనికి భూమి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

రగిలిపోతున్న యువకులు
రెండుకుటుంబాల్లో ఇద్దరు యువకులు ఉన్నారు. దాసాయి ముండాకు కను ముండా అనే కుమారుడు ఉండటంతో ప్రత్యర్థి కుటుంబంలో సాగర్ ముండా (20) అనే యువకుడు ఉన్నాడు. వరుసకు బావాబావమరుదులు అయ్యే సాగర్ ముండా, కను ముండా భూముల పంపకం విషయంలో ఒకరి మీద ఒకరు గొడవలు పడుతున్నారు.

పగలు ఇంట్లోనే కిడ్నాప్ చేసి ?
డిసెంబర్ 1వ తేదీన కను ముండా కుటుంబ సభ్యులు పొలంలో వరిపంట కోయ్యడానికి వెళ్లారు. ఆ సందర్బంలో ఇంట్లో కను ముండా మాత్రమే ఉన్నారు. సాయంత్రం దాసాము ముండా కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో కను ముండా కనపడలేదు. నీ కొడుకు కను ముండాను కొందరు కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని గ్రామస్తులు దాసాయి ముండాకు చెప్పారు.

రంగంలోకి దిగిన పోలీసులు
మరుసటి రోజు వరకు కొడుకు కను ముండా కోసం దాసాయి ముండా కుటుంబ సభ్యులు గాలించారు. చివరికి దాసాయి ముండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిరిజన కుటుంబానికి చెందిన కను ముండా కనపడటకపోవడం, అదే గిరిజన కులానికి చెందిన సాగర్ ముండా కిడ్నాప్ చేశాడని ఆరోపణలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

తల నరికి సెల్ఫీలు తీసుకున్న ప్రత్యర్థులు
కిడ్నాప్ అయిన కను ముండా మొండెం కుమాంగ్ గోప్లా అటవి ప్రాంతంలో కనపడింది. 15 కిలోమీటర్ల దూరంలోని దుల్వా గోప్లా ప్రాంతంలో కను ముండా తల కనపడింది. కజిన్ బ్రదర్ కను ముండాను కసితీరా తల నరికి చంపిన సాగర్ ముండా, అతని స్నేహితులతో ఆ తల చేతిలో పట్టుకుని సెల్ఫీలు తీసుకున్నారని వెలుగు చూసిందని ఖుంటి సబ్ డివిజన్ సీనియర్ పోలీసు అధికారి అమిత్ కుమార్ మీడియాకు చెప్పారు.

కిరాతకులు అందర్
భూమి పంపకాల వియంలో యువకుడిని అతని బావమరిది తల నరికి హత్య చెయ్యడం జార్ఖండ్ లో కలకలం రేపింది. సాగర్ ముండాతో పాటు అతని నలుగురు స్నేహితులను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన వేటకొడవళ్లు, ఎస్ యూవీ కారు స్వాధీనం చేసుకున్నామని ఖుంటి సబ్ డివిజన్ సీనియర్ పోలీసు అధికారి అమిత్ కుమార్ మీడియాకు చెప్పారు.