Viral video: శబరిమలలో అద్భుతం జరిగింది..

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. మకరజ్యోతి దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప భక్తులు జ్యోతిని దర్శించుకున్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిమల కొండలు మార్మోగి పోయాయి. పొన్నాంబలమేడు పైనుంచి మూడుసార్లు జ్యోతి దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అయ్యప్ప నామస్మరణతో శబరిమల మారుమోగింది.

కేరళలోని శబరిమల క్షేత్రంలో అపురూపమైన ఘట్టం ఆవిష్కృతమైంది. శబరిమలలోని పొన్నంబలమేడు కొండలపై మకరజ్యోతి మూడుసార్లు భక్తులకు దర్శనమిచ్చింది. పవిత్రమైన మకరజ్యోతిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ భగవన్నామ స్మరణతో మారుమోగిపోయాయి.

Divine Glory at Sabarimala Makara Jyothi Appears in Spectacular Display on Makar Sankranti 2026

ఏటా సంక్రాంతి సందర్భంలో శబరిమలలో మకరజ్యోతి దర్శనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్వం బోర్డు, కేరళ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. మకరజ్యోతి దర్శనం అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మకరజ్యోతి దర్శనం కోసం సుమారు 1.5 లక్షల మందికి పైగా భక్తులు విచ్చేసినట్లు అంచనా ఉంది. ఈ మకర జ్యోతి దర్శనంతో మండల- మకరవిళక్కు తీర్థయాత్రలో ప్రధాన ఘట్టం ముగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+