వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాక్లెట్ అనుకుని టపాసులు తిన్న చిన్నారి, మృతి

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలోని రత్నగిaరి జిల్లాలో దీపావళి పండగ రోజున ఓ కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఐదేళ్ల చిన్నారి చాక్లెట్ అనుకుని టపాసులు తినేసి మరణించింది. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖేడ్ తాలూకాలోని తిసాంగి గ్రామంలో ఉండే దామిని నికమ్ అనే చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా అక్కడ కొన్ని టపాసులు పడి ఉన్నాయి.

వాటిని చాక్లెట్ అనుకుని పొరపాటున తినేసిందని ఖేడ్ పోలీసులు తెలిపారు. గమనించిన ఆ బాలిక తల్లి ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. దీనిపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Diwali tragedy: Girl eats fire cracker thinking it is chocolate, dies

భారీ వర్షాలు: 27కు చేరిన మృతుల సంఖ్య

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో కురిసిన భారీ వర్షాలకు మృత్యువాతపడిన వారి సంఖ్య 27కు చేరింది. తమిళనాడు సీఎం జయలిలత వర్ష బీభత్సంపై అంచనావేయడానికి అధికారులతో బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. మృత్యువాత పడిన కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా మృత్యువాత పడిన కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వర్షాలకు ఎక్కువగా దెబ్బతిన్న కడలూరు జిల్లాలో పాఠశాలలకు గురువారం కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.

వర్షాల పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం జయలలిత ఐఏఎస్‌ అధికారులను జిల్లాలకు ప్రత్యేకంగా కేటాయించారు. కడలూరు జల్లాకు ఐఏఎస్‌ అధికారి జ్ఞాన్‌దీప్‌ సింగ్‌ బేడీని కేటాయించారు. వాయుగుండం ప్రభావం ఎక్కువగా దక్షిణ జిల్లాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

English summary
A five-year-old girl died after "eating" a fire cracker mistaking it for a chocolate in her village in the district today, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X