Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మొత్తం ఖాళీ చెయ్యాలని డీకే బ్రదర్స్ ప్లాన్, మాజీ ప్రధాని, మాజీ సీఎంకు చెక్?

లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీగా సాగుతుండటంతో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు. కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గం అనేక కారణాలతో కర్ణాటకలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. సిట్టింగ్ ఎంపీ సుమలత బీజేపీ నుంచి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, బీజేపీతో పొత్తుపెట్టుకున్న జేడీఎస్ మండ్య నియోజకవర్గం నిలబెట్టుకోవడం కోసం తీవ్రంగా పోరాడుతోంది.

జేడీఎస్ సీట్ల కేటాయింపుపై బీజేపీ చర్చలు జరుపుతుండగా, ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో మండ్యలో కాంగ్రెస్ తన అభ్యర్థి పేరును ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి వెంకటరమణ గౌడ్ (స్టార్ చంద్రు)కు ఎంపీ టికెట్ దక్కింది. జేడీఎస్‌కు కంచుకోటగా ఉన్న మండ్య అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ విజయం సాధించగా, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ జేడీఎస్‌ను ఓడించేందుకు డీకే బ్రదర్స్ రంగంలోకి దిగారు. కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్, ఆయన సోదరుడు బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేష్ జేడీఎస్ అంతు చూడాలని ప్లాన్ చేశారని వెలుగు చూసింది.

DK brothers targeted JDS party in Mandya district in Karnataka

మండ్యలో ఇంత వరకు జేడీఎస్ అభ్యర్థిని ప్రకటించకముందే జేడీఎస్ బలాన్ని తగ్గించుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. జేడీఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు డీకే బ్రదర్స్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది. ఇప్పటికే మండ్య జిల్లాకు చెందిన జేడీఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జేడీఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. నాలుగుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన జేడీఎస్ నేత మరి తిబ్బెగౌడ జేడీఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌ సమక్షంలో మరి తిబ్బేగౌడ నేతృత్వంలో భారీ ఎత్తున ఆయన మద్దతుదారులు కూడా జేడీఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మాట్లాడిన మరి తిబ్బెగౌడ కుటుంబ రాజకీయాలు, పార్టీలో కమ్యూనికేషన్ లోపానికి వ్యతిరేకంగా జేడీఎస్ ను వీడినట్లు తెలిపారు. హాసన్, మండ్య, చామరాజనగర్, మైసూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ మరి తిబ్బేగౌడ సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ కు హామీ ఇచ్చారు.

DK brothers targeted JDS party in Mandya district in Karnataka

జేడీఎస్ మాజీ ఎమ్మెల్సీ మరి తిబ్బేగౌడ, మాజీ ఎమ్మెల్యే అప్పాజీగౌడ్‌తో పాటు మండ్య జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా జేడీఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ ఎమ్మెల్యే, మండ్య జిల్లాకు చెందిన మాజీ మంత్రి నారాయణ గౌడ్ కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది డీకే బ్రదర్స్ కూడా మండ్య జిల్లాలో బీజేపీ, జేడీఎస్ కు సినిమా చూపించి వారి సత్తాను చాటాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మండ్య నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ నేతలు గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+