ఆ పార్టీ ఉందా?, ఆ పార్టీలో సొంత అల్లుడికే దిక్కులేదు, ఇక నాయకులు ఏం చేస్తారు, డీకే!
జేడీఎస్ పార్టీ ఎక్కడ ఉంది?, జేడీఎస్ పార్టీని ఆ పార్టీ నాయకులే తెరమరుగు చేస్తున్నారని, జేడీఎస్ పార్టీ ఉండాలని నేను కోరుకుంటున్నానని, కానీ ఆ పార్టీ పెద్దలు వారి ఇంటి అల్లుడినే బీజేపీలోకి పంపి జేడీఎస్ పార్టీ ఉనికిలేకుండా చేస్తున్నారని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ఎద్దేవ చేశారు. గతంలో మేము ఓ తప్పు చేశాం. కానీ జేడీఎస్ అంతకంటే పెద్ద తప్పు చేసిందని డీసీఎం డీకే శివకుమార్ జేడీఎస్ పార్టీని దుయ్యబట్టారు.
జేడీఎస్ పార్టీ గురించి మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వామీజీలను మీరు, హెచ్ డీ కుమారస్వామి ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారని మీడియా ప్రశ్నించగా స్వామీజీలను రాజకీయాల్లోకి లాగడం లేదని, స్వామీజీలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని చెబుతున్నామని డీకే శివకుమార్ అన్నారు. ప్రజలు తెలివి తక్కువ వారుకాదని, తమ జీవితాన్ని కష్టతరం చేసేవారి కోసం మద్దతు ఇస్తారని డీకే శివకుమార్ అన్నారు.

ప్రజల జీవితాలను బాగు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని, ఒక్కలిగ కులస్తులతో పాటు కర్ణాటకలోని ప్రజలంతా కాంగ్రెస్‌కు అండగా ఉంటారని డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్కలిగుల నుంచి 5 శాతం ఓట్లు వచ్చాయని డీకే శివకుమార్ అన్నారు. ఈసారి ఒక్కలిగులు ఎవరికి మద్దతిస్తారు అనే మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ సమాధానం ఇచ్చారు. ఒక్కలిగులు, ఇతర కులస్తులు అందరూ మూర్ఖులుకారని, వారికి ఎవరు సహాయం చేస్తారో, దేశానికి ఎవరు సేవ చేస్తారో చూస్తారని, వారికే ఓటు వేస్తారని డీకే శివకుమార్ అన్నారు.

కర్ణాటక రాష్ట్రానికి, దేశానికి ఎవరి వలన మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచిస్తారని, ప్రజలు వారితోనే ఉండాలని అనుకుంటారని, మంచి జీవితం కావాలని ఆలోచించే ప్రజలు వారికే ఓటు వేస్తారని డీకే శివకుమార్ అన్నారు. స్వామీజీల ఆశీర్వాదం ప్రజలతో పాటు మాకు ఉండాలని కోరుకుంటున్నానని, స్వామీజీలకు ఇచ్చే గౌరవం మేము ఇస్తామని, వారిని రాజకీయాల్లోకి లాగాలని మేము కోరుకోవడం లేదని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు.












Click it and Unblock the Notifications