డీకే శివకుమార్ సీఎం పదవిపై పిటిషన్.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నియామకాన్ని, అలాగే ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) కర్ణాటక హైకోర్టు మంగళవారం తీవ్రంగా పరిగణించి కొట్టేసింది. ఈ పిటిషన్ వెనుక ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని, ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానం విలువైన సమయాన్ని వృథా చేసినందుకు గానూ పిటిషన్ వేసిన హుబ్బళ్లి నివాసి మంగళప్ప అనే వ్యక్తికి రూ.50,000 జరిమానా విధిస్తూ రెండు వారాల్లోగా ఈ మొత్తాన్ని 'కర్ణాటక రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ'కి చెల్లించాలని ఆదేశించింది.

చీఫ్ జస్టిస్ విభూ బాఖ్రూ, జస్టిస్ కేఎస్ హిమలేఖలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది హునుమంత్ కుమార్.. కేసు బలాన్ని గమనించి పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని న్యాయస్థానాన్నికోరారు. అయితే దీనికి ప్రధాన న్యాయమూర్తి నిరాకరిస్తూ.. "ఇలాంటి అర్థరహితమైన పిటిషన్లు వేసినందుకు మీరు ఖచ్చితంగా జరిమానా కట్టాల్సిందే.. పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు" అని గట్టిగా హెచ్చరించారు. కేవలం వార్తల్లో నిలవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి పిటిషన్లు వేస్తున్నారని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ సమయంలో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామంటే సరిపోదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.పిల్ అనే పవిత్రమైన వేదికను దుర్వినియోగం చేయడాన్ని న్యాయవ్యవస్థ ఎంతమాత్రం సహించబోదని కోర్టు హెచ్చరించింది. సరైన ఆధారాలు, బలమైన కారణాలు లేకుండా కోర్టులకు వచ్చి సమయాన్ని వృథా చేసే ఇలాంటి పిటిషన్లపై భవిష్యత్తులోనూ కఠినంగా వ్యవహరిస్తామని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

DK Shivakumar CM Appointment Karnataka HC Dismisses PIL Imposes Rs 50 000 Fine on Petitioner

అసలు పిటిషనర్ వాదన ఏమిటంటే.. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1A) ప్రకారం, మంత్రిమండలిలో కనీసం 24 మంది నుంచి గరిష్టంగా 33 మంది సభ్యులు ఉండాలి. కానీ డీకే శివకుమార్‌తో కేవలం 13 మంది (మొత్తం 14 మంది) మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని పిటిషనర్ పేర్కొన్నారు.

అయితే పిటిషనర్ రాజ్యాంగ నిబంధనను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారని ధర్మాసనం ఎత్తిచూపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1A) ప్రకారం.. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిపి కనీస మంత్రుల సంఖ్య 12 గా ఉండాలి. కానీ పిటిషనర్ ఆ నిబంధనలో ఉన్న '12 సంఖ్య'ను, అసెంబ్లీ మొత్తం స్థానాల్లో '12 శాతం'గా పొరపాటుపడి కోర్టుకు వచ్చారని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

ఈ క్రమంలో కోర్టు పిటిషనర్ న్యాయవాదిని ప్రశ్నిస్తూ.. "ప్రస్తుతం ఎంతమంది ప్రమాణ స్వీకారం చేశారు?" అని అడిగింది. దానికి లాయర్ "14 మంది" అని సమాధానమివ్వగా.. "మరి 14 అనేది 12 కంటే ఎక్కువా? తక్కువా? మీరే 14 మంది అంటున్నారు, అది 12 కంటే తక్కువ ఎలా అవుతుంది? రాజ్యాంగంలో '12' అని ఉంది కానీ, '12 శాతం' అని ఎక్కడా లేదు" అని కోర్టు చురకలు అంటించింది. కేవలం ప్రచారం కోసమే ఇలాంటి పిటిషన్లు వేసి న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+